in ,

తనకు రూ.58.7కోట్ల ఆస్తి ఉన్నట్లు పేర్కొన్న కేసీఆర్

తనకు రూ.58.7 కోట్ల ఆస్తి ఉన్నట్లు పేర్కొన్న కేసీఆర్

సీఎం కేసీఆర్ తనకు ఉన్న ఆస్తుల విలువను ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆయన సంవత్సర ఆదాయం రూ.1.60 కోట్లని తెలిపారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ తన పేరిట రూ.58.7 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. నగదు, బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులు కలిపి రూ. 35.42 కోట్ల విలువైన చరాస్తులు, ఇళ్లు, ఫాంహౌస్‌, ప్లాట్లు కలిపి రూ.23.50 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని ప్రకటించారు.

తన పేరిట సొంత భూమి, కార్లు, బైక్‌, ఇతర వాహనాలు ఏవీ లేవని పేర్కొన్నారు. ఇక తన పేరు మీద రూ.17.27 కోట్ల అప్పు, కుటుంబం పేరు మీద రూ.7.23 కోట్ల అప్పు ఉందని అఫిడవిట్లో వెల్లడించారు. తన సంవత్సర ఆదాయం రూ.1.60 కోట్లని సీఎం కేసీఆర్‌  ఈసీకి తెలిపారు.

What do you think?

ప్రమోషనల్ కంటెంట్ పంపాలంటే యూజర్ అనుమతి కావాలి

చెత్త ఏరుకునే వ్యక్తికి రూ.25 కోట్లు దొరికాయి