in

4జీ సేవలు ప్రారంభించనున్న బీఎస్ఎన్ఎల్ (BSNL)

4జీ సేవలు ప్రారంభించనున్న బీఎస్ఎన్ఎల్ (BSNL)

బీఎస్ఎన్ఎల్ (BSNL) 4జీ సేవలు ప్రారంభించబోతోంది. అతి త్వరలోనే ఈ సేవలు అందించబోతోంది.

ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని బీఎస్ఎన్ఎల్ (BSNL) అధికారులు తెలిపారు. ముందుగా పంజాబ్ నుంచి ఈ సేవలు ప్రారంభిస్తామని వెల్లడించారు. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలకు సంబంధించి ఇప్పటికే 200 ప్రదేశాల్లో విజయవంతంగా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

ముందుగా పంజాబ్‌లో ప్రారంభించి దశలవారీగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని స్పష్టం చేశారు. 2024 జూన్ నాటికి దేశ వ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు.

What do you think?

పాన్ కార్డ్ పోయిందా? డౌన్లోడ్ చేసుకోండిలా..

నిత్యవసర సరుకుల డెలివరీకి వెళ్లి మహిళపై అత్యాచారం