in ,

లోకేష్ “లియో” బావుంది. కానీ.. “లియో” రివ్యూ

లోకేష్ “లియో” బావుంది. కానీ.. “లియో” రివ్యూ

“లియో”, “విక్రమ్” తరువాత లోకేష్ కనగరాజ్ నుంచి వస్తున్న , అందులోనూ ఎల్సియు (LCU) లో ఒక భాగం అయిన సినిమా కావడంతో ఆడియెన్స్ లో ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ (high expectations) ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కు తగ్గట్టుగానే లోకేష్ “లియో” ను తెరకెక్కించారు. ఇది కశ్చితంగా లోకేష్ సినిమానే.

లోకేష్ సినిమాలలో ఒక పాటర్న్ (pattern) ఉంటుంది. తన ప్రతి సినిమాలో స్టార్టింగ్ (starting) లో ఒక సంఘటన (incident ) జరుగుతుంది. దాని వల్ల హీరో లైఫ్ పూర్తిగా మారిపోతుంది. తరువాత సినిమా అంతా ఆ ఇన్సిడెంట్ వల్ల వచ్చే ప్రతికూల పరిస్థితుల చుట్టూ తిరుగుతుంది. “లియో” సినిమా కూడా అదే పాటర్న్ లో సాగుతుంది.

కథ:

పార్థి అలియాస్ పార్థిబన్ (thalapathy vijay) హిమాచల్ ప్రదేశ్ లోని థియోగ్ లో ఒక మామూలు జీవితం గడుపుతుంటాడు. ఒక వైపు యానిమల్ రెస్క్యూవర్ (animal rescuer) గా మరో వైపు కేఫ్ (cafe) ను నడుపుతూ తన కుటుంబంతో ఆనందంగా జీవిస్తుంటాడు. కానీ ఒక రోజు అనుకోకుండా జరిగిన ఒక సంఘటన వలన పార్థిబన్ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఆ సంఘటన మూలంగా పార్థిబన్ ఫోటోలు దేశమంతా పాకుతాయి. ఆ ఫోటును చూసి పార్థిబన్ ను “లియో” అనుకుని ఒక గ్యాంగ్స్టర్ (gangster) పార్థిబన్ దగ్గరకు వస్తాడు. ఆ తరువాత ఏం జరిగింది? పార్థిబన్ వాళ్ళ నుంచి ఎలా తప్పించుకున్నాడు? పార్థిబన్, లియో ఒకరేనా..? అన్నది మిగతా కథ.

ఎలా ఉంది అంటే..

ఇది ఒక మాస్ కమర్షియల్ సినిమా. హీరో ఎలివేషన్లు (elevations) , భారీ యాక్షన్ సీన్లు, దద్దరిల్లి పోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (bgm) అన్ని ఈ సినిమాలో ఉన్నాయి. ఆడియెన్స్ కి తప్పకుండా నచ్చే సినిమానే. అలాగే మెప్పిస్తుంది కూడా.. కానీ చిక్కంతా అక్కడే వచ్చింది. ఇలాంటి మాస్ కమర్షియల్ సినిమాల్లో హీరోలు సూపర్ మ్యాన్ లా ఉంటారు. అంటే ఎటువంటి సమస్య వచ్చినా కొంచం కష్టపడి సాల్వ్ చేసేస్తారు. ఇందులో కూడా అంతే.

లియో ఫస్ట్ హాఫ్ అంతా బానే ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ నుంచి సినిమాలో కాన్ ఫ్లిక్ట్ (conflict) కనిపించదు. కుటుంబాన్ని కాపాడుకోవాలి అనే ఒక బలమైన కాన్ ఫ్లిక్ట్, ఒక బలమైన గోల్ ఉన్నప్పటికీ అది సినిమాలో తేలిపోతుంది.

సినిమాల్లో హీరోకి ఒక గోల్, ఒక డిజైర్ (desire) ఉంటుంది. దాన్ని సాధించడానికి హీరో ఏం చేశాడు? ఎలా చేశాడు? అన్నది సినిమా. అది ఆడియెన్స్ ను తెర నుంచి కళ్లు తిప్పనివ్వదు.

“లియో” లో అది మిస్ అవుతుంది. హీరో ఒక సూపర్ హీరో లాంటి క్యారెక్టర్ కావడం వల్ల ఏ సమస్య వచ్చినా ఫైట్ చేసి సులువుగా సాల్వ్ చేసేస్తాడు. దీంతో ఏదో చూసాములే అన్నట్లు ఉంటుంది కానీ సినిమాలోని ఎమోషన్స్ ను ఆడియెన్స్ ఫీల్ అవ్వలేరు. ఇక సంజయ్ దత్, అర్జున్ సర్జాల పాత్రలను హీరో ఓడించడానికి విలన్స్ (villians) ఉండాలి కాబట్టి పెట్టినట్లుంటుంది. అనిరుధ్ మాత్రం ఎప్పటిలాగే తన మ్యూజిక్ తో సినిమాకి మరింత బలాన్ని ఇచ్చాడు.

ఇక లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) విషయానికి వస్తే ఇంతకు ముందు వచ్చిన (“ఖైదీ” “విక్రమ్”) రెండు సినిమాల్లోని పాత్రలు దీంట్లో పెట్టాలని, ఆడియన్స్ తో విజిల్ వేయించాలని మాత్రమే పెట్టినట్లు ఉంటుంది. తరువాత సినిమాలలో ఈ సినిమాను ఎలా కలుపుతారు.. “లియో” వాటిలో ఎలాంటి పాత్ర పోషిస్తాడు.. అన్నది చూడాలి.

What do you think?

కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పరీక్షల తేదీలు విడుదల

పాన్ కార్డ్ పోయిందా? డౌన్లోడ్ చేసుకోండిలా..