in

చూపు లేకపోయినా బ్యాంకులో ఉద్యోగం సాధించాడు

చూపు లేకపోయినా బ్యాంకులో ఉద్యోగం సాధించాడు

చూపు లేకపోయినా ఓ యువకుడు కష్టపడి చదివి బ్యాంకులో ఉద్యోగాన్ని సాధించాడు. తన దృఢ సంకల్పంతో ఎంతో మంది యువతీ యువకులకి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నాడు.

వివరాల్లోకి వెళ్తే గుజరాత్ అహ్మదాబాద్‌కు చెందిన అజీజ్ మినాట్ పుట్టిన కొన్నేళ్లకు కంటి చూపును కోల్పోయాడు. అజీజ్‌కు మూడేళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన కుటుంబం సూరత్ నుంచి అహ్మదాబాద్‌కు మకాం మార్చింది. అక్కడే ఆశ్రమ్ రోడ్‌లో ఉన్న అంధుల పాఠశాలలో అజీజ్ చదువుకున్నాడు. కంటి చూపు తన కలను నెరవేర్చుకోవడానికి అడ్డని అజీజ్ ఎప్పుడూ భావించలేదు. ఆ దృఢ సంకల్పంతోనే ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగం సాధించాడు. ఎంతో మంది యువతీ యువకులకు ఆదర్శంగా నిలిచాడు.

What do you think?

ఇండియా గెలిస్తే రూ.100 కోట్లు పంపిణీ చేస్తాం – పునీత్ గుప్తా

అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.70లక్షల బంగారం స్వాధీనం