in

వీడియోలకు లైకులు కొట్టమని రూ. 50 లక్షలకు టోపీ

వీడియోలకు లైకులు కొట్టమని రూ. 50 లక్షలకు టోపీ

యూట్యూబ్ వీడియోలకు లైకులు కొడితే వేతనం ఇస్తామంటూ కొందరు కేటుగాళ్లు ఓ వ్యాపారి నుంచి రూ. 50 లక్షలు కాజేసారు. చివరికి మోసపోయానని తెలుసుకున్న ఆ వ్యాపారి పోలీసులకు పిర్యాదు చేశాడు.

వివరాల్లోకి వెళ్తే నిజాం పేట ప్రగతి నగర్ కు చెందిన 34 ఏళ్ల ఓ వ్యాపారిని కొందరు కేటుగాళ్లు మలితా అనే అమ్మాయి పేరుతో వాట్స్ యాప్ ద్వారా పరిచయం చేసుకున్నారు. యూట్యూబ్ లో వీడియోలకు లైకులు, కామెంట్లు చేస్తే వేతనం ఇస్తామని మాయమాటలు చెప్పారు. దాని కోసం టెలిగ్రాం ఛానెల్ (telegram channel) లో జాయిన్ అవ్వాలని, రోజుకు 3 టాస్కులు చేస్తే రూ.150 లకు మించి సంపాదించవచ్చని చెప్పుకొచ్చారు.

వాళ్ళు చెప్పినట్లే చేసిన వ్యాపారి మొదట్లో డబ్బులు రావడం చూసి వారిని పూర్తిగా నమ్మేసాడు. అదే అదునుగా చూసుకున్న కేటుగాళ్లు కొంత డబ్బు కట్టాలని, పూర్తయ్యాక మొత్తం తిరిగి ఇస్తామని నమ్మించారు.

వ్యాపారి ప్రత్యేక వ్యాలెట్ ద్వారా తొలుత రూ. వెయ్యి పంపగా తిరిగి రూ.1,300 పంపారు. రెండోసారి రూ.13 వేలు పంపగా…రూ.16,900 బదిలీ చేశారు.

లాభం రావడంతో బాధితుడు ఏడు సార్లుగా రూ.23.30 లక్షలు పంపాడు. ఈ డబ్బు తిరిగి ఇవ్వాలంటే మీ క్రెడిట్ స్కోరు ఇంకా బాగుండాలని.. ఇందుకు రూ.30 లక్షలు పంపాలని కోరగా.. వ్యాపారి నమ్మి అలాగే చేశాడు.

అనంతరం రూ.20.14 లక్షలు కడితే మొత్తం డబ్బు ఇస్తామని చెప్పారు. చివరికి పూర్తిగా మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు జరిగినది విని కేసు నమోదు చేశారు.

What do you think?

ఆ గ్రామంలో ఉండేది 11 మందే.. ఓట్లు ఉన్నది ఐదుగురికే

భారత్ అద్భతంగా ఆడుతోంది. వరల్డ్ కప్‌ భారత్ దే – షోయబ్ అక్తర్