in ,

5 గంటలు పాటు ఈత కొట్టి.. రికార్డు సృష్టించిన 9 ఏళ్ల చిన్నారి

5 గంటలు పాటు ఈత కొట్టి.. రికార్డు సృష్టించిన 9 ఏళ్ల చిన్నారి

ఓ 9 ఏళ్ల బాలిక నిర్విరామంగా ఈత కొట్టి గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. నిరంతరాయంగా 12 గంటలు పాటు ఈదడమే తన లక్ష్యమని ఆ చిన్నారి తెలిపింది.

వివరాల్లోకి వెళ్తే ఛత్తీస్ గడ్ లోని దుర్గ్ జిల్లాకు చెందిన పురఈ అనే గ్రామం క్రీడలకు ప్రసిద్ధి చెందింది. కాగా ఆ గ్రామానికి చెందిన తనుశ్రీ కోసరే (9) ఈతపై ఆసక్తితో శిక్షణ తీసుకుంది. తనుశ్రీ రోజూ 7 నుంచి 8 గంటలపాటు సాధన చేసేది.

అయితే ఈ ఆదివారం ఆ చిన్నారి ఐదు గంటల పాటు ఏకబిగిన చెరువులో ఈది గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఇంత చిన్న వయసులోనే 5 గంటల పాటు ఈది అందరి ప్రశంసలు అందుకుంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “ఇలా తను అనుకున్నది సాధించడం తనకు చాలా ఆనందాన్నిచ్చింది. నిరంతరాయంగా 12 గంటలపాటు ఈదడమే నా లక్ష్యం. అది కూడా నేను కచ్చితంగా సాదిస్తాను.” అని చెప్పింది.

What do you think?

కేజీ రూ. 10 కి కూడా కొనే పరిస్థితి లేని టమాటా

మీకు ఎమర్జెన్సీ అలర్ట్ రాలేదా..? ఫోన్ లో ఈ సెట్టింగ్స్ మార్చుకోండి