in

ఒక్క షరతు తప్పినా మళ్లీ జైలుకే -చంద్రబాబు బెయిల్‌

ఒక్క షరతు తప్పినా మళ్లీ జైలుకే -చంద్రబాబు బెయిల్‌

స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యంతర బెయిల్‌ కాపీలో హైకోర్టు చంద్రబాబుకు పలు షరతులు విధించింది.

ఆ షరతుల ప్రకారం చంద్రబాబు మీడియా, ఏ విధమైన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. కేవలం ఆస్పత్రి మినహా మరే ఇతర కార్యక్రమాల్లో ఆయన పాల్గొనరాదు. బెయిల్‌ గడువు ముగిశాక అంటే నవంబర్‌ 24వ తేదీ సాయంత్రం కల్లా చంద్రబాబు లొంగిపోవాలి. ఆయన ఈ కేసును ఏ విధంగా ప్రభావితం చేయడానికి వీల్లేదు. ఈ పై షరతులలో ఏ ఒక్క దానైనా ఉల్లంఘిస్తే బెయిల్‌ మరుక్షణమే రద్దు అవుతుంది. వీటన్నిటినీ జస్టిస్‌ మల్లికార్జున రావు ఆయనిచ్చిన తీర్పు కాపీలో  స్పష్టం చేశారు.

What do you think?

ఎయిర్ కెనడా అమానుషం. దివ్యాంగుడి పై కనికరం చూపక..

ఓటర్ల జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం. చెక్ చేసుకోండిలా