in ,

“జీవితంలో అనుకున్న వెంటనే ఏది జరగదు”- రోహిత్ శర్మ

“జీవితంలో అనుకున్న వెంటనే ఏది జరగదు” – రోహిత్ శర్మ

చాలా మంది టాలెంటెడ్ క్రికెటర్స్ కి అవకాశం అందలేదని రోహిత్ శర్మ అన్నారు. జీవితంలో అనుకున్న వెంటనే ఏది జరగదని వ్యాఖ్యానించారు.

ఇటీవల ఓ ఆంగ్ల వెబ్‌సైట్ కి భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంటర్య్వూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు కెప్టెన్‌ అవకాశం 26 లేదా 27 ఏళ్ల వయసులో వచ్చి ఉంటే బాగుండేదని అన్న రోహిత్, జీవితంలో అనుకున్నదేది వెంటనే జరిగిపోదని అన్నారు.

జట్టులో చాలా మంది విన్నర్లుగా ఉన్నా.. వారికి కెప్టెన్సీ అవకాశం అందలేదని, గతంలో గౌతమ్ గంభీర్, సెహ్వాగ్, యువరాజ్ సింగ్ లాంటి స్టార్లు ఆడారని, కానీ వారు ఎప్పుడూ కెప్టెన్సీ చేపట్టలేదని పేర్కొన్నారు. ఇప్పుడు తనకు అవకాశం వచ్చిందని, ఇది తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని రోహిత్ చెప్పుకొచ్చారు.

What do you think?

36 గంటల పాటు సముద్రంలో తేలి చావును ఎదిరించాడు.

‘విజయం సాధించగలమన్న నమ్మకం ఉంది’- కెప్టెన్ కమిన్స్