in ,

టీమిండియా ఆటగాళ్లు ఆర్మ్ బ్యాండ్స్ వేసుకుంది ఇందుకే

టీమిండియా ఆటగాళ్లు ఆర్మ్ బ్యాండ్స్ వేసుకుంది ఇందుకే..

ఈ ఆదివారం లక్ నౌ (Lucknow) లో జరిగిన ఇండియా vs ఇంగ్లాండ్ 2023 ఒన్డే ఇంటర్నేషనల్ (ODI) వరల్డ్ కప్ లో టీమిండియా ఆటగాళ్లు చేతులకి బ్లాక్ ఆర్మ్ బ్యాండ్స్ (black arm bands) వేసుకుని కనిపించారు. దీంతో వాళ్లు అలా ఎందుకు వేసుకున్నారు? అని అందరిలో ఒక ప్రశ్న మొదలైంది. ఈ ప్రశ్నకు సమాధనం తెలుసుకోవడం కోసం అందరూ తెగ ప్రయత్నిస్తున్నారు.

టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడి (bishan singh bedi) గత సోమవారం అంటే 2023, అక్టోబర్ 23న 77 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

బిషన్ సింగ్ బేడీ 1967 నుండి 1979 వరకు మొత్తం 67 టెస్ట్ మ్యాచ్ లు ఆడగా.. 226 టిక్కెట్లు తీసారు. ఆయన ఆడిన 10 ఒన్ డే ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్ లలో 7 వికెట్లు తీయడంతో పాటు ఇండియా మొదటి సారి గెలిచిన ఓడిఐ (ODI) మ్యాచ్ లో ముఖ్య పాత్ర పోషించారు.

అలాంటి దిగ్గజ క్రికెటర్ అయిన బిషన్ సింగ్ బేడీ గౌరవానికి చిహ్నంగా ఈ ఆదివారం (అక్టోబర్ 29న ) ఇండియా – ఇంగ్లాండ్ కు (IND vs ENG ) జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లందరూ బ్లాక్ ఆర్మ్ బ్యాండ్స్ (Black arm bands) ను చేతులకి వేసుకున్నారు.

What do you think?

నిత్యవసర సరుకుల డెలివరీకి వెళ్లి మహిళపై అత్యాచారం

సామాన్యులకు మరోసారి చుక్కలు చూపించబోతున్న ఉల్లి – టమాటా ధరలు