in ,

బంగ్లాదేశ్‌ పై ఆస్ట్రేలియా ఘన విజయం

బంగ్లాదేశ్‌ పై ఆస్ట్రేలియా ఘన విజయం

బంగ్లాదేశ్‌ ను చిత్తుగా ఓడించి ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేవలం రెండు వికెట్లు కోల్పోయి, 44.4 ఓవర్లలో ఆట ముగించేసింది.

ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 306-8 స్కోరు చేసింది. అయితే ఈ భారీ లక్ష్యాన్ని ఆసీస్ రెండే వికెట్లు కోల్పోయి, 44.4 ఓవర్లలోనే ఛేదించింది.

మిచెల్ మార్ష్‌ 132 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్స్‌లు బాది 177 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. 87 బంతుల్లోనే శతకం నమోదు చేశాడు. అటు స్టీవ్ స్మిత్ (63*), వార్నర్ (53) అర్ధ శతకాలు బాదారు. ఇక బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్‌, ముస్తాఫిజుర్ తలో వికెట్ తీశారు.

What do you think?

12 ఏళ్ల వయసులోనే రూ.21 లక్షలు గెలుచుకుంది

ఈ 5 సినిమాలు చూశారా? చూడకపోతే చూసేయండి