in ,

మరో స్వర్ణం సొంతం చేసుకున్న భారత్ మహిళల జట్టు

మరో స్వర్ణం సొంతం చేసుకున్న భారత్ మహిళల జట్టు

INDw vs SLw : శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత మహిళల జట్టు 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో భారత్ ఖాతాలో రెండో స్వర్ణం చేరింది.

సోమవారం (09/25) శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
స్మృతి మంధాన 46 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలువగా.. జెమీమా రోడ్రిగ్స్ 42 పరుగులతో రాణించింది. ఇక భారత బౌలర్లలో టిటస్ సాధు 3 వికెట్లు, రాజేశ్వరీ గైక్వాడ్ 2 వికెట్లు పడగొట్టారు. కాగా నిర్ణీత 20 ఓవర్లలో భారత్ జట్టు 7 వికెట్లకు 116 పరుగులు చేసింది.

అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు ఆఖరి ఓవర్‌లో విజయానికి 25 పరుగులు చేయాల్సి ఉండగా.. కేవలం 5 పరుగులు మాత్రమే చేయగలిగింది.

దీంతో భారత మహిళల జట్టు 19 పరుగుల తేడాతో విజయం సాధించి స్వర్ణం సొంతం చేసుకుంది. శ్రీలంక రజతంతో సరిపెట్టుకుంది.

ఈ విజయంతో మరో స్వర్ణం భారత్ సొంతం కాగా.. ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో ఇప్పటివరకు 2 స్వర్ణాలు, మూడు రజతాలు సహా మొత్తం 11 పతకాలు ఉన్నాయి.

What do you think?

త్వరలో ప్రారంభం కానున్న పవన్ కళ్యాణ్ వారాహీ యాత్ర

చంద్రబాబు అరెస్ట్ పై కేటీఆర్. “ఇక్కడ ర్యాలీలు చేస్తే ఊరుకోం.”