in ,

చంద్రబాబు అరెస్ట్ పై కేటీఆర్. “ఇక్కడ ర్యాలీలు చేస్తే ఊరుకోం.”

చంద్రబాబు అరెస్ట్ పై కేటీఆర్. ” ఇక్కడ ర్యాలీలు చేస్తే ఊరుకోం.”

చంద్రబాబు అరెస్టుపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఏపీలో భూమి దద్దరిల్లేలా ర్యాలీలు చేసుకోండి కానీ తెలంగాణాలో చేస్తే ఊరుకునేది లేదని కరాఖండిగా చెప్పేశారు.

ఏపీ రాజకీయాలకు తెలంగాణతో సంబంధం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. ‘ఏపీలో చంద్రబాబును అరెస్టు చేస్తే అక్కడ ర్యాలీలు చేసుకోండి. రాజమండ్రిలో భూమి దద్దరిల్లేలా ర్యాలీలు చేసుకోండి. ఇక్కడ ఎవరు చేసినా ఉరుకునేది లేదు. ప్రశాంతంగా ఉన్న ఐటీని డిస్టర్బ్ చేయోద్దు. లోకేష్ నాకు ఫోన్ చేసి ర్యాలీలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని అడిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగొద్దనే ర్యాలీలకు అనుమతి ఇవ్వలేదని చెప్పా.’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

What do you think?

మరో స్వర్ణం సొంతం చేసుకున్న భారత్ మహిళల జట్టు

విడాకులపై నవ్వుతూనే ఘాటు సమాధానం ఇచ్చిన స్వాతి