in

డ్రగ్స్ కోసం సొంత బిడ్డల్ని అమ్ముకున్న దంపతులు

డ్రగ్స్ కోసం సొంత బిడ్డల్ని అమ్ముకున్న దంపతులు

డ్రగ్స్ మత్తులో పడి ఇద్దరు దంపతులు సొంత బిడ్డల్నే అమ్ముకున్నారు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్ర రాజధాని ముంబై కు చెందిన షబ్బీర్ ఖాన్, అతడి భార్య సానియా డ్రగ్స్‌కు బానిసలయ్యారు. ఈ క్రమంలో డ్రగ్స్‌ కొనేందుకు డబ్బులు లేకపోవడంతో మొదట రూ.60,000 కు రెండేళ్ల బాబును , అనంతరం నెల రోజుల బాబును రూ.14,000 కు షకీల్ మక్రానీ అనే వ్యక్తికి అమ్ముకున్నారు.

అయితే ఈ విషయం షబ్బీర్ ఖాన్ సోదరి రుబీనాకు తెలిసింది. దీంతో రుబీనా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ జరిపి షకీల్ మక్రానీని, డ్రగ్స్‌ ఏజెంట్‌ ను అరెస్ట్‌ చేశారు.

What do you think?

సీఎం జగన్ కు సుప్రీం కోర్టు నోటీసులు

ఎలోన్ మస్క్ “టెస్లా” ఇండియాకి వస్తోందా?