in ,

12 ఏళ్ల వయసులోనే రూ.21 లక్షలు గెలుచుకుంది

12 ఏళ్ల వయసులోనే రూ.21 లక్షలు గెలుచుకుంది

ఓ విద్యార్థిని స్మోక్ డిటెక్టర్ కంటే వేగంగా పనిచేసే ఫైర్ డిటెక్టర్ ను అభివృద్ధి చేసింది. 12 ఏళ్ల వయసులోనే రూ.21 లక్షల అవార్డును గెలుచుకుంది.

అమెరికాలోని 12 ఏళ్ల విద్యార్థిని రూ.21 లక్షల అవార్డును గెలుచుకుంది. భారత సంతతికి చెందిన 12 ఏళ్ల షాన్యా గిల్ స్మోక్ డిటెక్టర్ కంటే వేగంగా పనిచేసే రాపిడ్ ఫైర్ డిటెక్టర్ ను అభివృద్ధి చేసింది.

షాన్యా గిల్ సైంటిఫిక్ జూనియర్ ఇన్నోవేటర్స్ ఛాలెంజ్‌లో పాల్గొంది. ఈ ఛాలెంజ్‌లో మొత్తం 65,000 మంది విద్యార్థులు పోటీ పడగా.. షాన్యా టాప్ అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డు కింద షాన్యా గిల్ 25 వేల డాలర్లు అంటే 21 లక్షలు రూపాయలు తన సొంతం చేసుకొంది.

What do you think?

చెత్త ఏరుకునే వ్యక్తికి రూ.25 కోట్లు దొరికాయి

బంగ్లాదేశ్‌ పై ఆస్ట్రేలియా ఘన విజయం