in ,

నిత్యవసర సరుకుల డెలివరీకి వెళ్లి మహిళపై అత్యాచారం

నిత్యవసర సరుకుల డెలివరీకి వెళ్లి మహిళపై అత్యాచారం

నిత్యవసర సరుకులు డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన వ్యక్తి ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

ఉత్తర్ ప్రదేశ్ లో గ్రేటర్ నోయిడాలోని హైరైజ్ అపార్ట్మెంట్ లో నివాసం ఉండే ఓ మహిళ ఇంటికి అవసరమైన సరకులను ఓ యాప్లో ఆర్డర్ చేశారు. వాటిని డెలివరీ ఇవ్వడానికి 23 ఏళ్ల సుమిత్ సింగ్ అనే డెలివరీ బాయ్ ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఆ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇది గమనించిన అతడు ఆమె ఒక్కరే ఉన్నారని నిర్థారించుకొని, బలవంతంగా ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా నెమ్మదిగా అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ ఘటన అనంతరం ఆత్యాచారానికి గురైన బాధితురాలు వెంటనే పోలీసులకు పిర్యాదు చేసింది.

ఆమె పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతడి మొబైల్ సిగ్నల్స్ పట్టుకుని వాటి ఆధారంగా ఉన్న అతడున్న చోటును కనిపెట్టి అక్కడికి వెళ్ళారు. అయితే అక్కడ వాళ్లను చూసిన నిందితుడు వారికి మొదట లొంగిపోయినట్లు నటించాడు. పోలీస్ కూడా అది నమ్మేసారు. అదే అదునుగా చూసిన నిందితుడి వెంటనే ఒక కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని పరారయ్యాడు.

పోలీసులు అతడి వెంట పరుగెడుతుంటే కాల్పులు జరిపాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు అతడి కాళ్లపై ఎదురుకాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం నిందితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు నోయిడా పోలీసులు వెల్లడించారు. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత కోర్ట ఎదుట హాజరుపరుస్తామని తెలిపారు.

What do you think?

4జీ సేవలు ప్రారంభించనున్న బీఎస్ఎన్ఎల్ (BSNL)

టీమిండియా ఆటగాళ్లు ఆర్మ్ బ్యాండ్స్ వేసుకుంది ఇందుకే