in ,

ఎర్ర చెందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ హరి!

ఎర్ర చెందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ హరి!

ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమీడియన్ హరి ఇరుక్కున్నాడు. ప్రస్తుతం హరి పరారీలో ఉండగా.. పొలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే పుంగనూరు మండలంలోని మొరంపల్లి వద్ద 60 లక్షల విలువ చేసే ఎర్ర చెందనం దుంగలను అక్రమంగా తరలిస్తుండగా.. కొందరు నిందితులను పొలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులలో కిషోర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన కిషోర్ ను విచారిస్తున్న సమయంలో జబర్దస్త్ కమీడియన్ హరి పేరు బయటకు వచ్చింది. దీంతో హరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కానీ హరి ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది.

అయితే రెండేళ్ల క్రితం చిత్తూరు జిల్లాలో చీకిమానుకోన అటవీ ప్రాంతంలో ఎర్ర చెందనం స్మగ్లింగ్ చేస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు ఎనిమిది మంది దుండగులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ వ్యవహారంలో కూడా హరి పేరు బయటకి వచ్చింది. కానీ అతను అప్పుడు తప్పించుకున్నాడు.

ఈ సారి హరిని పట్టుకునే తీరాలని అతని కోసం పోలీసులు పూర్తి స్థాయిలో గాలిస్తున్నారు.

What do you think?

చిరుతతో పోరాడి యజమానిని కాపాడుకున్న ఆవు!

టీఎస్-ఈసెట్ ఫలితాల విడుదల తేదీ ఖరారు. జూన్ 13న..