చిరుతతో పోరాడి యజమానిని కాపాడుకున్న ఆవు!
ఓ ఆవు, కుక్క వీరోచితంగా పోరాడి చిరుతనే పారిపోయేటట్టు చేశాయి. ఈ ఘటన కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే దావణగెరె జిల్లాలో 58 ఏళ్ల కరిహలప్ప అనే రైతు తన ఆవును తీసుకుని పొలానికి వెళ్లాడు. అయితే అదే సమయంలో పొదలో దాగి ఉన్న ఓ చిరుత హఠాత్తుగా కరిహలప్ప పై దాడికి ప్రయత్నించింది. ఇది చూసిన ఆవు వెంటనే అక్కడకు వచ్చి తన కొమ్ములతో చిరుత పై దాడి చేసింది. అక్కడ ఉన్న కుక్క కూడా చిరుతతో పోరాటంలో ఆవుకు సహాయంగా వచ్చింది. అలా రెండూ కలిసి చిరుత పై దాడి చేశాయి. దీంతో వాటి దాడికి భయపడిన చిరుత వెంటనే అక్కడి నుంచి పారిపోయింది.