in ,

టీఎస్-ఈసెట్ ఫలితాల విడుదల తేదీ ఖరారు. జూన్ 13న..

టీఎస్-ఈసెట్ ఫలితాల విడుదల తేదీ ఖరారు. 

ఉస్మానియా యూనివర్శిటీ ఆధ్వర్యంలో మే 20 న నిర్వహించిన  టీఎస్-ఈసెట్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 22 వేల మందికి పైగా విద్యార్దులు హాజరయ్యారు. ఈసెట్ ర్యాంకుల ఆధారంగా పాలిటెక్నిక్, బీఎస్సీ పూర్తి చేసిన విద్యార్థులకు బీఈ/బీటెక్/బీ ఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలో చేరే అవకాశం కల్పిస్తుంటారు. అయితే తాజాగా టీఎస్-ఈసెట్ ఫలితాల విడుదల తేదీను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇటీవల ప్రకటించింది.

జూన్ 13 న (మంగళవారం) మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లుగా టీఎస్ సిహెచ్ ఈ (TSCHE) తెలిపింది.

What do you think?

ఎర్ర చెందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ హరి!

సైబర్‌ నేరగాళ్లకు కోటిన్నర సమర్పించుకున్న ఓ యువతి