in ,

ఏఈఈ పరీక్షల కొత్త తేదీలను ప్రకటించిన టీఎస్పీఎస్సి

పేపర్ లీకేజీ కారణంగా రద్దయిన ఏఈఈ నియామక
పరీక్షల కొత్త తేదీలను టీఎస్పీఎస్సి (tspsc) ప్రకటించింది. పరీక్షలు రద్దయి ఏం జరుగుతుందో తెలియని తికమక పరిస్థితులలో ఉన్నవారికి శుభవార్త చెప్పింది.

ఈ ఏడాది జనవరి 22న నిర్వహించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఏఈఈ పరీక్షలను ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడంతో టీఎస్పీఎస్సీ రద్దు చేసిందన్న విషయం తెలిసిందే. దీంతో అభ్యర్థులలో ఆందోళన చేటు చేసుకుంది. రాసిన పరీక్షలు రద్దవడంతో అందరూ తలలు పట్టుకుని కూర్చున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో టీఎస్పీఎస్సీ నియామక పరీక్ష కొత్త తేదీలను ప్రకటించింది.

మే 8న ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మే 9న అగ్రికల్చర్, మెకానికల్ ఏఈఈ ఆన్లైన్ పరీక్ష, మే 21న సివిల్ ఏఈఈ ఓఎంఆర్ పరీక్ష నిర్వహించినున్నట్లు టీఎస్పీఎస్సీ తాజాగా వెల్లడించింది.

What do you think?

రికార్డుల మోత మోగించిన సౌతాఫ్రికా-వెస్టిండీస్!

తిట్టారని ఆత్మ హత్య చేసుకున్న 9 ఏళ్ళ చిన్నారి.