in

తిట్టారని ఆత్మ హత్య చేసుకున్న 9 ఏళ్ళ చిన్నారి.

తొమ్మిదేళ్ళ చిన్నారి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. తల్లిదండ్రులకు తీరని లోటును మిగిల్చింది. తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్ళూరు జిల్లాలో ఈ హృదయ విధారకం అయిన ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని తిరువళ్ళూరుకు చెందిన తొమ్మిదేళ్ళ చిన్నారి ప్రతిక్ష నాలుగో తరగతి చదువుతోంది. ప్రతిక్ష శరదగా రీల్స్ చేస్తూ ఇరుగు పొరుగు వారిని మెప్పిస్తుండేది. దీంతో అక్కడ వాళ్ళందరూ తనని రీల్స్ క్వీన్ అని పిలిచేవారు.

అయితే మార్చ్ 28, మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో బంధువుల ఇంటి ముందు స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న ప్రతిక్షను తల్లిదండ్రులు కృష్ణమూర్తి, కర్పగం ఇంటికి వెళ్లి చదువుకోమని హెచ్చరించి చిన్నారికి ఇంటి తాళాలు ఇచ్చి వారు మార్కెట్కు వెళ్లారు. దీంతో మనస్తాపం చెందిన చిన్నారి కిటికీ చువ్వకు తువ్వాలుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దాదాపు గంట తర్వాత ఇంటికి తిరిగొచ్చిన తల్లిదండ్రులు తలుపులు లోపలి నుంచి గడియపెట్టి ఉండటం గమనించారు.

తలుపును తీయమని కుమార్తెను కోరారు. కానీ ప్రతిక్ష ఎంతకీ స్పందించకపోవదంతో తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ ఆచేతన స్థితిలో ఉన్న తమ కుమార్తెను చూసి బిత్తరపోయారు. వెంటనే ఆసుపత్రికి
తరలించారు. కానీ ఫలితం లేకపోయింది.

అప్పటికే ఆలస్యమవడంతో చిన్నారి మృతి చెందింది. కేసు నమోదు చేసిన తిరువళ్లూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితుల ముందు తల్లిదండ్రులు తిట్టారనే కోపంతోనే చిన్నారి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు తెలిపారు.

What do you think?

ఏఈఈ పరీక్షల కొత్త తేదీలను ప్రకటించిన టీఎస్పీఎస్సి

తెలంగాణా భాష ను తెరపైకి తెచ్చినందుకు ధన్యవాదాలు.