in ,

“మర్మాణువు” కోసం క్రౌడ్ ఫండింగ్. వెంకటేష్ మహా..

“మర్మాణువు” కోసం క్రౌడ్ ఫండింగ్.. వెంకటేష్ మహా..

సినిమా అంటే రెండు – మూడు గంటలు ఎంటర్టైన్ (entertain) చేసి, కొంత సేపు నిజాన్ని మరచిపోయేలా చేసే మాయ అని అనుకుంటాం. కానీ సినిమా అంటే నిజాన్ని మరచిపోయేలా చేసేది కాదు అబద్దంలో నిజాన్ని చూపించేది. మనుషుల ప్రవర్తన, వారి చుట్టూ జరిగే పరిస్థితులు, మన కల్చర్ (culture), మన రిలీజియన్స్ (religions) ఇలా ప్రతి దానిలోని తప్పులను వేలెత్తి చూపి, అవి ఏంటో మనకు తెలియచేసేది సినిమా.

అలాంటి సినిమాలు వచ్చేది చాలా తక్కువ. వాటికి వచ్చే గుర్తింపు తక్కువే. అలా నిజాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తూనే అందర్నీ కట్టిపడేసేలా సినిమాలు తీసే దర్శకులలో C/o కంచరపాలెం ( C/o Kancharapalem) దర్శకుడు వెంకటేష్ మహా (venkatesh maha) కూడా ఒకరు.

ఆయన మొదటి సినిమా C/o కంచరపాలెం లో చాలా సీన్లు నిజానికి అద్దం పడతాయి. మనం చేసే పనుల్ని వేలెత్తి చూపించి మనల్ని మనమే ప్రశ్నించుకునేలా చేస్తాయి.

ఆయన రెండో సినిమా “ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య” (uma maheshwara ugra roopasya) ఒక మలయాళ సినిమా రీమేక్ అయినప్పటికీ ఒరిజినల్ సినిమాలోని సోల్ మిస్ అవ్వకుండా మరింత అద్భుతంగా తెరకెక్కించి అందరి మెప్పు పొందారు. ఇప్పుడు కూడా అలాంటి ఓ అద్భుతమైన, భిన్నమైన కథతో మన ముందుకు రావాలని ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుతం ఆయన ” మర్మాణువు” (marmaanuvu) అనే ఓ కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో డార్క్ కామెడీ (dark comedy), మిస్టరీ (mystery), సైకలాజికల్ డ్రామా (psychological drama) తో పాటు మ్యాజికల్ రియలిసం (magical realism) కూడా ఉండబోతోందని దర్శకుడు వెంకటేష్ మహా తెలిపారు.

అయితే ఈ సినిమాను తెరకెక్కించడం కోసం ఆయన మన నుంచి ఓ చిన్న సహాయం కోరుతున్నారు. ప్రస్తుతం “మర్మాణువు” కోసం క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ (marmaanuvu crowd funding campaign) నడుపుతున్నారు. ఈ సినిమా బడ్జెట్ రూ. 6.5 కోట్లు కాగా.. ఇప్పటివరకు రూ. 26 లక్షల ఫండింగ్ వచ్చింది.

“మర్మాణువు” సినిమా ఎలా ఉండబోతోందో ఫండ్ చేసే వారికి అర్థం కావడం కోసం సినిమాలోని మొదటి సీన్ (scene) ను కూడా వెబ్సైట్ లో ఉంచారు. ఆ సీన్ చదివి, లేదా ఆయన విజన్ (vission) ను నమ్మి ఫండ్ చేయాలని భావించే వారు “www.Marmaanuvu.com” వెబ్సైట్ ను విసిట్ (visit) చేయొచ్చు. ఫండ్ చేసే వారికి కొన్ని బెనిఫిట్స్ కూడా వచ్చేలా క్రౌడ్ ఫండింగ్ పోర్టల్ ను డిజైన్ చేశారు.

What do you think?

రూ.16 కోట్ల లాటరీ గెలుచుకున్నాడు. నెలకి రూ.5.6 లక్షలు..

సైకో జగనాసురుడి పీడ ఈ ఏడాదితో పోవాలి – లోకేష్