in ,

ముఖ్యమంత్రి స్టాలిన్ ను నిలదీసిన సింగర్ చిన్మయి.

ముఖ్యమంత్రి స్టాలిన్ ను నిలదీసిన సింగర్ చిన్మయి.

 

సింగర్ చిన్మయి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను నిలదీసింది. తనకు ఎవరూ న్యాయం చేయట్లేదంటూ ఆరోపించింది.

వివరాల్లోకి వెళ్తే తమిళ పాటల రచయిత వైరముత్తు పై కొన్నేళ్ళ క్రితం చిన్మయి ఆరోపణలు చేసింది. ఆ సమయంలో ఇది దక్షణ భారత దేశంలో సంచలనం సృష్టించింది. అయితే ఆమె వైరముత్తు పై ఎన్ని ఆరోపణలు చేసినా.. అటు ప్రభుత్వం కానీ, ఇటు తమిళ సినీ పరిశ్రమ కానీ ఆయనపై కనీసం చిన్నపాటి చర్యలు కూడా తీసుకోలేదు.

ఇదిలిగా ఉండగా.. ఇటీవల భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, భారతీయ జనతాపార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శర్‌ణ్ పై మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. కొన్నాళ్ల నుంచి భూషణ్ శర్‌ణ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న రెజ్లర్లు పార్లమెంటు ఎదుట నిరసనకు ప్రయత్నించగా వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ విషయంపై స్పందించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దీన్ని ఖండిస్తూ రెజ్లర్లకు మద్దతుగా ట్వీట్ చేశారు. దీంతో చిన్మయి ఆరోపణలను అసలు పట్టించుకోని ఆయన ఈ విషయం పై వెంటనే ట్వీట్ చేయడంతో చిన్మయి ఆయన ట్వీట్ కు స్పందించింది. రెజ్లర్లకు మద్దతు తెలుపుతున్న ముఖ్యమంత్రికి తాను వైరముత్తు పై చేస్తున్న ఆరోపణలు ఎందుకు కనపడటంలేదని ప్రశ్నించింది.

 

ఎవరికైనా ఒకే నిబంధనలుండాలని, మీ పార్టీతో సన్నిహిత సంబంధాలున్న వైరముత్తు పై తనతో సహా 17 మంది మహిళలు బహిరంగంగా వెల్లడించింది. తమ కెరీర్ ను నాశనం చేశాడని, పరిశ్రమ నుంచి బహిష్కరించేలా చేశాడని ఆరోపించింది. వైరముత్తు రాజకీయ అండతో రెచ్చిపోతున్నా.. అతనికి వ్యతిరేకంగా తనకు మద్దతివ్వడానికి ఎవరూ ముందుకు రావడంలేదని చిన్మయి ఆవేదన వ్యక్తం చేసింది.

What do you think?

నిక్కీ హత్య కేసులో ఎట్టకేలకు చిక్కిన నిందితుడు.

‘నాటు నాటు’ పాటకు డాన్స్ ఆడిన ఉక్రెయిన్ ఆర్మీ!