in , ,

టాప్ 5 ప్రైమ్ వీడియో సినిమాలు,సీరీస్లు #పార్ట్ 2

టాప్ 5 ప్రైమ్ వీడియో సినిమాలు,సీరీస్లు

 

1.రింగ్స్ ఆఫ్ పవర్ (The Rings of Power 2022)

లార్డ్ ఆఫ్ ది రింగ్స్కు ప్రీక్వెల్ గా విడుదలైన రింగ్స్ ఆఫ్ పవర్ వచ్చిన కొంత సమయంలోనే రికార్డ్ లను బద్దలు కొట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పటివరకు ఏ సీరీస్ పొందని ఆదరణను పొందటంతో పాటు విడుదలైన 24గంటల్లోనే 25 మిలియన్ల వీక్షకులను చేరి రికార్డ్ని సృష్టించింది. బిన్నమైన ప్రపంచంతో,అబ్బురపరిచే విజువల్స్ తో ప్రేక్షకులను ఈ సీరీస్ కట్టిపడేస్తుంది.అటువంటి మాయలో మునిగి ఆనందాన్ని పొందాలంటే ఈ సీరీస్ ని తప్పక చూడాల్సిందే.

 

2.థాంక్యూ (Thank You 2022)

కథ: నారాయ‌ణ‌పురం గ్రామం నుంచి అభిరామ్ ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్తాడు.అక్కడ ఒక ఆప్ తయారు చేసి ఉన్నత స్థాయికి ఎదుగుతాడు.ఆ తరువాత తన జీవితంలో జరిగిన సంఘటనలే ఈ థాంక్యూ. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కించారు.

 

3.గంధర్వ (Gandharwa 2022)

కథ: యాభై ఏళ్లు పాటు కోమాలో ఉండి ఆ తరువాత స్పృహలోకి వచ్చిన వ్యక్తి ఎంటువంటి సంఘటనలు ఎదుర్కున్నాడు అన్నదే ఈ గంధర్వ. జార్జ్ రెడ్డి సినిమాతో నటతో నిరూపించుకున్న సందీప్ మాధవ్ మరోసారి గంధర్వ కథతో వచ్చాడు. ఇప్పటి వరకు తెలుగులో ఎవరు తీయని కొత్త కథతో ప్రేక్షకులను అలరించాడు సందీప్ మాధవ్.ఈ సినిమాను కొత్త దర్శకుడు అప్సర్ తెరకెక్కించారు.

 

4.యఫ్.ఐ.అర్ (FIR 2022)

కథ: ఇర్ఫాన్ అహ్మద్ కెమికల్ ఇంజనీర్, ఐఐటీ గోల్డ్ మెడలిస్ట్,అతడి తల్లి పోలీస్.కొన్ని అనుకోని సంఘటన వల్ల తను తీవ్ర వాధి అని ముద్ర పడుతుంది. తన నిజాయితీని నిరూపించుకున్నాడా అసలా ఏం జరిగింది అన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో విష్ణు విశాల్, రెబా మోనికా జాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రలో నటించారు.దర్శకుడు మను ఆనంద్ తెరకెక్కించగా,అశ్వంత్ స్వరాలు సమకూర్చారు.

 

5.మహాన్ (Mahaan 2022)

కథ: కామర్స్ లెక్చర్ అయిన గాంధీ మహాన్ 40 ఏళ్ల వయసు వచ్చిన తరువాత తనకు నచ్చినట్టు బ్రతకాలి అనుకుంటాడు. ఆ తరుణంలోనే మద్యం సిండికేట్ లీడర్ గా మారుతాడు. ఈ క్రమంలో మహాన్ కు ఎదురైన పరిస్థితులు ఏంటి తనకు దాదా బాయ్ నౌరోజి కి మధ్య జరిగిన సంఘటనలేంటి తెలియాలి అంటే మహాన్ చూడాల్సిందే. చియాన్ విక్రమ్,ఆయన తనయుడు ద్రువ్ కలిసి నటించిన సినిమా మహాన్.విక్రమ్ ఎప్పటిలాగే ప్రేషకులను అలరించగా,ద్రువ్ తన నటనతో అందర్నీ ఆశ్చర్య పరిచిచాడు.ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాను తెరకెక్కించారు.

What do you think?

టాప్ 5 ప్రైమ్ వీడియో సినిమాలు,సీరీస్లు #పార్ట్ 1

టాప్ 5 ప్రైమ్ వీడియో(prime) సీరీస్లు #పార్ట్ 1