in ,

ఎట్టకేలకు కొత్త సినిమాపై నోరు విప్పిన యష్

ఎట్టకేలకు కొత్త సినిమాపై నోరు విప్పిన యష్

 

శాండిల్ వుడ్ రాకింగ్ స్టార్ యష్ కొత్త సినిమాపై యష్ క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే ఒక మంచి సినిమాతో రాబోతున్నానని తెలిపారు.

స్టార్ హీరో యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్-1, కేజీఎఫ్ చాప్టర్-2 సినిమాలు ఏ స్థాయిలో విజయం అందుకున్నాయో అందరికీ తెలిసిన విషయమే. కేజీఎఫ్ చాప్టర్-2 బాక్స్ ఆఫీస్ దగ్గర రూ.1250 కోట్లు కొల్లగొట్టి చరిత్ర సృష్టించింది. ఆయనకి ఒక్క కర్ణాటక లోనే కాకుండా తెలుగు, హిందీ ఇలా అన్ని భాషలలోను అభిమానులను ఇచ్చింది. అలా ఆయన ఆ ఒక్క సినిమాతో కన్నడ హీరో నుంచి ఇండియన్ హీరో అయిపోయారు. అయితే కేజీఎఫ్ చాప్టర్-2 తరువాత యష్ మరో సినిమా (yash 19) వివరాలేవీ ఇంతవరకు బయట పెట్టలేదు. దీంతో ఆయన సినిమా కోసం అటు ప్రేక్షకులు, ఇటు ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు యష్ ఆయన కొత్త సినిమా (Yash 19) గురించి నోరు విప్పారు.

ఇటీవలే ఓ గోల్డ్ షాపును ఓపెన్ చేసేందుకు రాకింగ్ స్టార్ యష్ మలేషియా వెళ్లారు. ఈ సమయంలో ఆయనను చూడడానికి భారీ మొత్తంలో అభిమానులు వచ్చారు. వారితో యష్ కొంత సేపు ముచ్చటించారు. ఈ మాటల్లో ఓ అభిమాని ఆయన కొత్త సినిమా అప్డేట్ గురించి యష్ ను అడిగారు. దీంతో ఎట్టకేలకు యష్ తన కొత్త సినిమా వివరాలపై నోరు విప్పారు.

‘నేను నా తరువాత ప్రాజెక్ట్ కోసం బాగా కష్ట పడుతున్నాను. అయితే అది చాలా పెద్ద సినిమా అని నేను చెప్పను కానీ, అది ఒక మంచి సినిమా అని చెప్పగలను. ఆ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాను. నన్ను నమ్మండి. కొంచెం ఓర్పుతో వేచి ఉండండి.’ అని అన్నారు.

అయితే ఆయన తరువాత సినిమా (yash 19) నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్‍తో ఉండబోతోందని వాదనలు వినిపిస్తుండగా.. ఆగస్టులో ఆ సినిమా పూర్తి వివరాలు బయటకి వస్తాయని అంచనా వేస్తున్నారు.

What do you think?

కేరళలో అరుదైన వ్యాధితో బాలుడు మృతి

కార్డు లేకుండానే డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.