in

కార్డు లేకుండానే డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.

కార్డు లేకుండానే డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.

 

డబ్బులను విత్ డ్రా (withdraw) చేసుకోడానికి ఏటీఎం కు పదే పదే తిరుగుతుంటాం. అయితే కొన్నిసార్లు ఏటీఎం కు వెళ్ళేటప్పుడు డెబిట్ కార్డును మర్చిపోతుంటాం. అలా మర్చిపోయినప్పుడు తప్పక మళ్లీ ఇంటికి వెళ్ళి డెబిట్ కార్డును తీసుకోవాల్సి వస్తుంది. శుభవార్త ఏంటంటే ఇక నుంచి మనకు ఆ శ్రమ అవసరం లేదు. ఎందుకంటే కార్డు లేకుండానే నగదును విత్ డ్రా (cardless withdrawal) చేసుకోగలిగే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఓ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఆ కొత్త ఫీచర్ తో మనం డెబిట్ కార్డు లేకుండా కేవలం మన స్మార్ట్ ఫోన్ తోనే డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. ఇది మనకు మన పనిని కొంచెం సులభతరం చేస్తుంది.
కానీ కార్డు లేకుండా ఫోన్ తో ఎలా అంటారా.. చాలా సులభం అండి! నిత్యం మనం మనీ ట్రాన్సాక్షన్స్ (money transactions) కు వాడే ఫోన్ పే, గూగుల్ పే, లేదా సదరు బ్యాంకులకు సంభందించిన ఆన్ లైన్ బ్యాంకింగ్ యాప్స్ ద్వారా ఇది సాధ్యం అవుతుంది.

ఎలా అంటే..

మందుగా సదరు ఏటీఎం దగ్గరకు వెళ్లి దాంట్లో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) సదుపాయం ఉందో లేదో తెలుసుకోవాలి. ఆ సదుపాయం ఉన్నట్లైతే విత్ డ్రా సెక్షన్ లో ‘క్యూఆర్ క్యాష్’ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తరువాత ఒక్క సారి మాత్రమే వినియోగించ గలిగే ‘క్యూఆర్ కోడ్’ జెనరేట్ అవుతుంది. ఫోన్ పే లో కానీ, గూగుల్ పే లో కానీ ‘క్యూఆర్ స్కానర్’ ను ఓపెన్ చేసి ఆ ‘క్యూఆర్ కోడ్’ ను స్కాన్ చేసుకోవాలి. చివరిగా యూపీఐ పిన్ ను ఎంటర్ చేయాలి. ఈ విధంగా డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎం లో డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు.

ఇలా నెలకు లక్ష రూపాయల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే సదరు బ్యాంక్ నియమ నిబంధనల బట్టి ఈ లిమిట్ మారుతుంది. ఒక వేళ విత్ డ్రా సమయంలో అంతరాయం కలిగి డబ్బులు బ్యాంక్ అకౌంట్  నుంచి కట్ అయితే దగ్గరలో ఉన్న సంభందిత బ్యాంకును సంప్రదిస్తే సరిపోతుంది. కట్ అయిన డబ్బులు కొద్ది రోజులలోనే బ్యాంకులో క్రెడిట్ అయిపోతాయి.

What do you think?

ఎట్టకేలకు కొత్త సినిమాపై నోరు విప్పిన యష్

13 ఏళ్ల బాలికకు 43 ఏళ్ల వ్యక్తి తో పెళ్లి..