in

13 ఏళ్ల బాలికకు 43 ఏళ్ల వ్యక్తి తో పెళ్లి..

13 ఏళ్ల బాలికకు 43 ఏళ్ల వ్యక్తి  తో పెళ్లి..

 

నిజామాబాద్ జిల్లాలో 13 ఏళ్ల బాలికను 43 ఏళ్ల వ్యక్తి పెళ్లి చేసుకొన్నాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు, పొలీసులు ఆ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని ఓ తండాలో బాల్య వివాహం జరిగింది. తండాకు చెందిన 13 ఏళ్ల బాలికకు, ఫకీరాబాద్ కు చెందిన 42 ఏళ్ల సాహెబ్ రావు అనే వ్యక్తితో తండా వాళ్లు వివాహం జరిపించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికే సాహెబ్ రావు బాలికను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. విచారణకు వెళ్లిన పోలీసులపై స్థానికులు వాగ్వాదానికి దిగారు.

శనివారం డీసీపీవో చైతన్య కుమార్ ఆధ్వర్యంలో తండాకు వెళ్లి పొలీసులు విచారణ చేపట్టారు. కార్యదర్శి హైమద్ బాల్య వివాహం చేసుకున్న ఆ వ్యక్తితో పాటు పెళ్లికి సహకరించిన వారిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నవీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పెళ్లి చేసుకున్న వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారని స్ధానికులు చెబుతున్నారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ భాగ్యలక్ష్మి,చైల్డ్ హెల్ప్ లైన్ ప్రాజెక్టు సమన్వయకర్త జోత్స్న దేవి, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు శోభ తదితరులు పాల్గొన్నారు.

What do you think?

కార్డు లేకుండానే డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.91లక్షలు దోచుకుంది