in

పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.91లక్షలు దోచుకుంది

పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.91లక్షలు దోచుకుంది

 

పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ మహిళ ఒక ఐటీ ఉద్యోగి తో ట్రేడింగ్ యాప్ లో ఇన్వెస్ట్ చేయించింది. అతని  నుంచి రూ.91.5 లక్షలు దోచుకుంది.

వివరాల్లోకి వెళ్తే పూణె దెహ్రు రోడ్లోని ఆదర్శ్ నగర్లో నివాసముంటున్న ఓ ఐటీ ఉద్యోగి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. ఒక మంచి అమ్మాయి కోసం ఆన్లైన్ లో వెతకడం మొదల పెట్టాడు. ఈ క్రమంలో అతనికి మాట్రిమోని సైట్ లో ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అలా ఇద్దరు మాట్లాడుకోవడం, చాట్ చేసుకోవడం మొదలు పెట్టారు. తక్కువ సమయంలోనే అతనికి ఆ అమ్మాయి బాగా నచ్చింది. తను కోరుకున్నట్లే ఆ అమ్మాయి కూడా తనను పెళ్ళి చేసుకుంటానని చెప్పేసింది. అయితే పెళ్లి చేసుకోబోతున్న వారి భవిష్యత్ బావుండాలంటే ఇన్వెష్ట్ చేయాలని అతనితో ఆమె నమ్మ బలికింది.

అతను ఆమెను పూర్తిగా నమ్మిన తరువాత ‘బ్లెస్కాయిన్’ అనే ట్రేడింగ్ యాప్ లో ఇన్వెష్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పింది. అప్పటికి ఆమెను పూర్తిగా నమ్మిన అతను ఆ యాప్ లో చిన్న చిన్నగా ఇన్వెష్ట్ చేయడం మొదలు పెట్టాడు. చివరకి బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసుకుని కూడా ఇన్వెష్ట్ చేశాడు. అలా ఆమె మాటలు నమ్మి రూ.82 లక్షలు ఇన్వెష్ట్ చేశాడు. అంత ఇన్వెష్ట్ చేసినా ఇంకా రిటర్న్స్ రాకపోవడంతో ‘ఇంత డబ్బు ఇన్వెష్ట్ చేసినా ఇంకా రిటర్న్స్ రావట్లేదేంటి?’ అని అతను ఆమెను ప్రశ్నించాడు. ఆ మాటకు ‘ఇంకో రూ.10 లక్షలు ఇన్వెష్ట్ చెయ్యి. తప్పకుండా రిటర్న్స్ వస్తాయి’ అని ఆమె మాయ మాటలు చెప్పింది. ఆ మాటలు కూడా నమ్మిన అతను మరో రూ.10 లక్షలు కూడా ఇన్వెష్ట్ చేశాడు. అలా మొత్తం 91.7 లక్షలు ఇన్వెష్ట్ చేశాడు. ఇంకా రిటర్న్స్ కోసం ఎదురు చూడడం మొదలు పెట్టాడు.

అయితే ఒక రోజు హఠాత్తుగా ఆమె నుంచి అతనికి ఫోన్ కాల్స్ ఆగిపోయాయి. అతను ఎన్ని సార్లు కాల్ చేసినా ఆ కాల్స్ కలవలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆ ఐటీ ఉద్యోగి చివరికి పోలీసులను ఆశ్రయించాడు. తనకు జరిగినది వారికి వివరించాడు. అతని చెప్పిన వివరాలు విన్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

What do you think?

13 ఏళ్ల బాలికకు 43 ఏళ్ల వ్యక్తి తో పెళ్లి..

అనిరుధ్ రవిచందర్, జోనితా గాంధీల పెళ్లా..?!