in

ఎయిర్ కెనడా అమానుషం. దివ్యాంగుడి పై కనికరం చూపక..

ఎయిర్ కెనడా అమానుషం. దివ్యాంగుడి పై కనికరం చూపక..

విమానాశ్రయంలో వీల్‌ఛైర్‌ ను సిబ్బందిని నిరాకరించడంతో ఓ వ్యక్తి వీపుతో కదులుతూ ఫ్లైట్ నుంచి కిందకి వచ్చాడు. ఈ ఘటన లాస్ వేగాస్ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే బ్రిటిష్‌ కొలంబియాకు చెందిన రోడ్నీ హాడ్గిన్స్ అనే వ్యక్తి వీల్ చైర్ సాయం లేకుండా నడవలేడు. గత ఆగస్టులో భార్య డీనా హాడ్గిన్స్‌తో కలిసి లాస్‌ వెగాస్‌‌కు వెళ్లాడు. అయితే విమానం లాస్‌ వెగాస్‌లో ల్యాండ్‌ అయిన అనంతరం కిందకు దిగేందుకు వీల్‌ఛైర్‌ కావాలని సిబ్బందిని కోరగా నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక రోడ్నీ తన వీపుతో కదులుతూ జారుతుంటే ఆయన భార్య డీనా కాళ్లు పట్టుకుని కిందకు తీసుకెళ్లారు. ఈ బాధాకర విషయాన్ని రోడ్నీ భార్య డీనా తన సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

What do you think?

ఉత్తరప్రదేశ్‌లో 108 అడుగుల హనుమంతుడి విగ్రహం

ఒక్క షరతు తప్పినా మళ్లీ జైలుకే -చంద్రబాబు బెయిల్‌