in

ఉత్తరప్రదేశ్‌లో 108 అడుగుల హనుమంతుడి విగ్రహం

ఉత్తరప్రదేశ్‌లో 108 అడుగుల హనుమంతుడి విగ్రహం

ఉత్తరప్రదేశ్‌లో 108 అడుగుల ఎత్తైన హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అది కూడా యమునా నది ఒడ్డున ప్రతిష్టించారు.

వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌ రాజ్‌లో యమునా నది ఒడ్డున త్రివేణి పుష్ఫ్ ప్రాంతంలో 108 అడుగుల ఎత్తైన హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. నగర కొత్వాల్‌గా పిలిచే హనుమంతుడి విగ్రహంతో పాటు ఆలయ నిర్మాణం కూడా చేపట్టనున్నారు. 2025లో మహా కుంభమేళా కంటే ముందే ఆలయాన్ని నిర్మించనున్నారు. హరిద్వార్‌కు చెందిన పరమార్థ నికేతన్ త్రివేణి పుష్ప్‌ హనుమంతుడి విగ్రహంతో పాటు పలు కట్టడాలని నిర్మిస్తోంది. కాగా ప్రస్తుతం ఈ హనుమంతుడి విగ్రహానికి సంబంధిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

What do you think?

సామాన్యులకు మరోసారి చుక్కలు చూపించబోతున్న ఉల్లి – టమాటా ధరలు

ఎయిర్ కెనడా అమానుషం. దివ్యాంగుడి పై కనికరం చూపక..