in ,

“జవాన్” ఓటీటీలోకి వచ్చేస్తోంది.స్ట్రీమింగ్ అప్పుడే

“జవాన్” ఓటీటీలోకి వచ్చేస్తోంది. స్ట్రీమింగ్ అప్పుడే..

ఇటీవల విడుదలైన ఇండియాని ఒక ఊపు ఊపేసిన ‘జవాన్’ సినిమా ఏ స్తాయిలో కలెక్షన్స్ కొల్లగొట్టిందో తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ చరిత్రలో రికార్డు సృష్టించింది. రూ.1000 కోట్ల వసూళ్లను సులువుగా రాబట్టిన ‘జవాన్’ ప్రపంచవ్యాప్తంగా రూ.1103 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. దీంతో గ్లోబల్ వైడ్ గా రూ. 1100 కోట్ల వసూళ్లు సాధించిన మొదటి హిందీ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. అలాగే 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగానూ నిలిచింది. థియేటర్లలోకి వచ్చి నెల దాటిపోయినా ఇంకా ‘జవాన్’ మేనియా కొనసాగుతూనే ఉంది. ఇండియా మొత్తం ఎంటర్‌ టైన్ చేస్తూనే ఉంది.

అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలకు కూడా సిద్దం అయ్యిందట. “జవాన్” డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ మొత్తానికి సొంతం చేసుకుందని సమాచారం. వచ్చే నెల నవంబర్ 2 న “జవాన్” సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.

What do you think?

“సనాతన ధర్మంపై మాట్లాడటం ఆపే ప్రసక్తే లేదు” – ఉదయనిది స్టాలిన్

అమెరికాలో 23 వేల ఏళ్ల పురాతన మానవ పాదముద్రలు