in ,

మూసీ నదిలో దొరికిన తల కేసును ఛేదించిన పొలీసులు!

మూసీ నదిలో దొరికిన తల కేసును ఛేదించిన పొలీసులు!

కొన్ని రోజుల క్రితం మూసీ నది వద్ద ఓ మహిళ తల దొరకడం హైదరబాద్ లో కలకలం రేపిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా పోలిసులు ఈ కేసును ఛేదించారు. ఆ తల ఓ నర్సు దని గుర్తించారు.

వివరాల్లోకి వెళ్తే అనురాధ అనే 55 మహిళ ఓ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తుంది. ఈమె చంద్రమోహన్ అనే వ్యక్తికి రూ.7 లక్షలు అప్పుగా ఇచ్చింది. ఆ తర్వాత అతడితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది.

అయితే చంద్ర మోహన్ కి ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమని అనురాధ అడగడంతో అతను ఆమెను హత్యచేశాడు. కత్తి, టైల్స్ కట్టర్‌తో శరీరభాగాలను ముక్కలుగా నరికి, తలను వేరు చేసి మూసీ నదిలో విసిరేశాడు.

ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు అనురాధ ఇంటిపైన ఉండే చంద్ర మోహన్  ఈ ఘోరానికి పాల్పడినట్లుగా తెలుసుకున్నారు. అనురాధ మిగతా శరీర భాగాలను అతని ఫ్రిజ్‌లో గుర్తించి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

What do you think?

వరుడు ని వెంటాడి మరీ పెళ్లి చేసుకున్న వధువు!

ఏపీ గ్రూప్1,గ్రూప్2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్