in ,

“పుష్ప 2” లో సాయి పల్లవి కనిపించనుందా..?

ఇండియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “పుష్ప2 ” సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట సందడి చేస్తుంది. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఈ సినిమాలో కనిపించబోతోందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో అభిమానులలో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కుతున్న “పుష్ప 2” సినిమాపై ఇప్పటికే ఇటు అభిమానులలోనూ, అటు ప్రేక్షకులలోనూ అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో ఆ అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి.

తాజాగా అందిన సమాచారం ప్రకారం విభిన్నమైన సినిమాలతో, వైవిద్యమైన పాత్రలతో ఎప్పుడూ ప్రేక్షకులను అలరించే నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఈ సినిమాలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సుకుమార్ టీమ్ ఆమెను సంప్రదించారని, రోల్ నచ్చడంతో ఆమె కూడా వెంటనే ఓకే చెప్పిందని నెట్టింట వార్తలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఒక వైపు సాయిపల్లవి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు, సాయిపల్లవి నిజంగానే ఈసినిమాలో నటిస్తున్నారా? అన్న దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

What do you think?

కే.జీ.ఎఫ్ పై దర్శకుడు వెంకటేష్ మహా ఘాటు వ్యాఖ్యలు.

అక్కడ టికెట్ కొంటారు. కానీ ప్రయాణించరు.