in

అక్కడ టికెట్ కొంటారు. కానీ ప్రయాణించరు.

టికెట్ కొని ట్రైన్ మిస్స్ అయిన వాళ్లని చూసుంటారు. తప్పని పరిస్థితుల్లో ప్రయాణాన్ని వాయిదా వేసుకునే వాళ్ళని చూసుంటారు. కానీ టికెట్ కొని కావాలని ట్రైన్ ఎక్కకుండా ఉండే వాళ్లని చూశారా?. చూడకపోతే దయాల్ పూర్ రైల్వే స్టేషన్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ఈ దయాల్ పుర్లో గ్రామస్థులు టికెట్ తీసుకుంటారు కానీ ట్రైన్ ఎక్కరు.

విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ సమీపంలో ఉండే ఈ దయాల్ పుర్ స్టేషన్ను 1954లో నిర్మించారు. మొదట్లో కొన్నేళ్ల పాటు ఈ ట్రైన్ రాకపోకలు బాగానే సాగాయి. కానీ తర్వాత ప్రయాణికులు తగ్గిపోవడం, దానితో ఆదాయం తగ్గిపోవడంతో 2006లో స్టేషన్ను పూర్తిగా మూసేశారు.

అయితే ప్రయాణించడానికి ఇబ్బందులు ఎదుర్కొన్న గ్రామస్థులు తమ గ్రామంలో రైల్వే స్టేషన్ ను తిరిగి ప్రారంభించాలంటూ కొన్నేళ్లపాటు పోరాటం చేయగా.. వారి కృషి ఫలించి 2022 జనవరిలో అధికారులు ఈ స్టేషన్ను తిరిగి ప్రారంభించారు.
రెండో సారి కూడా కొన్నాళ్లపాటు టికెట్లు బాగానే అమ్ముడుపోయాయి. కానీ ఆ తర్వాత మళ్లీ అమ్మకాలు పడిపోయాయి. దీంతో ఇన్నేళ్లు కష్టపడి తిరిగి తెరిపించుకున్న రైల్వే స్టేషన్ మళ్లీ మూతపడితే? అన్న సందేహం గ్రామస్థుల్లో మొదలైంది. ఆదాయం తగ్గి స్టేషన్ మూతపడుతుందేమో అనే బయంతో గ్రామస్థులు ప్రయాణం చేయకపోయినా టికెట్లు కొనడం మొదలు పెట్టారు.

ఎప్పుడైనా టికెట్ల అమ్మకం తగ్గితే వాళ్ళే టిక్కెట్లు కొని ట్రైన్ను మూయకుండ మనుగడలో ఉంచడానికి ప్రభుత్వానికి సహాయపడ్డారు. ఆలా.. 2022 డిసెంబర్ వరకు నెలకు సుమారు 700 టికెట్లు అమ్ముడుపోయాయి. కానీ ఈ ఏడాది ప్రారంభం నుంచి టికెట్ల అమ్మకాలు మళ్లీ పడిపోయాయి. దీన్ని గమనించిన గ్రామస్థులు ఇప్పుడు మళ్లీ పెద్ద సంఖ్యలో టికెట్లు కొంటున్నారు. స్టేషన్ ఆదాయం తగ్గిపోయినప్పుడల్లా తాము టికెట్లు కొంటామని గ్రామస్థులు చెబుతున్నారు.

What do you think?

“పుష్ప 2” లో సాయి పల్లవి కనిపించనుందా..?

పెళ్లి కూతురు కట్నం ఇవ్వలేదని వెళ్ళిపోయిందా..?