in ,

జపాన్ లో అద్బుతాలు సృష్టిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ !

జపాన్ లో అద్బుతాలు సృష్టిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ !

 

విడుదలైనప్పటి నుండి ఎన్నో అవార్డులను, రికార్డులను సాధిస్తూ చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. మొన్నటి వరకు అమెరికాలో దుమ్ము దులిపి ‘ఆస్కార్’ ను అందుకుని తెలుగు వాడి సత్తాని తెల్ల వాడికి తెలియ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పుడు జపాన్ లో అద్బుతాలు చేస్తోంది.

 

‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు జపాన్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దీంతో మన సినిమా అక్కడ కూడా అద్బుతాలు చేస్తోంది. అక్కడ ఈ సినిమాకి 1 బిలియన్ యెన్ అంటే దాదాపు రూ.60 కోట్ల రూపాయల వసూళ్లు రావడంతో.. అ దేశంలో అత్యధిక వసూళ్లను సాధించిన భారతీయ చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు సృష్టించింది.

ఇక జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల నటన అక్కడి వారికి బాగా నచ్చడంతో వీరిద్దరు అక్కడ హాట్ టాపిక్ గా మారారు. దీంతో వీరిద్దరిపై పలు జపాన్ పత్రికలు ఆర్టికల్స్ రాస్తుండగా.. అక్కడి ‘యాన్ యాన్’ అనే జపనీస్ మ్యాగజైన్‌  వీరిరువురి ఫోటోలను మ్యాగజైన్‌  కవర్ పై  ప్రచురించింది. అలా విడులైననప్పటి నుండి అద్బుతాలు సృష్టిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మరోసారి వార్తలకెక్కింది.

What do you think?

రంగారెడ్డి జిల్లాలో విషాదం. ప్రాణం తీసిన ఐపీఎల్!

ఏపీ లో బీ ఆర్ ఎస్ కార్యాలయం ప్రారంభం