in ,

కొన్నాళ్ళు సినిమాల నుంచి బ్రేక్ తీసుకోనున్న సమంత.

కొన్నాళ్ళు సినిమాల నుంచి బ్రేక్ తీసుకోనున్న సమంత.

 

సమంత సినిమాల నుంచి గాప్ తీసుకోనున్నారట. ఇప్పటికే తీసుకున్న అడ్వాన్స్ లను కూడా తిరిగి ఇచ్చేసారట.

టాలీవుడ్ లేడీ సూపర్స్టార్ సమంత ‘మయో సైటిస్’ అనే ఒక అరుదైన ఆనారోగ్యంతో భాద పడుతూ చికిత్స తీసుకుంటున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యం పై శ్రద్ద పెట్టాలన్న ఉద్దేశంతో దానికి అవసరమైన అదనపు తీసుకోవడం కోసం ఒక ఏడాది బ్రేక్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ‘శాకుంతలం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ప్రస్తుతం శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ‘ఖుషి’ సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ కూడా ఇంకో 3-4 రోజులలో పూర్తి కాబోతోంది. దీంతో ఈ సినిమా తరువాత ఏడాది గాప్ తీసుకుని ఆరోగ్యం పై శ్రద్ద పెట్టబోతున్నారని.. ఇప్పటికే గతంలో ఓప్పుకున్న కొన్ని ప్రాజెక్ట్స్ కోసం తీసుకున్న అడ్వాన్స్ ను కూడా తిరిగి ఇచ్చేసారని టాక్ నడుస్తుంది.

అయితే ఈ విషయం పై సమంత నుంచి కానీ, ఆమె టీమ్ నుంచి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

What do you think?

బెన్ స్టోక్స్ ను దారుణంగా అవమానించిన ఆస్ట్రేలియా

పెట్రోల్ ధర రూ.15కు పడిపోతుంది – మంత్రి గడ్కరీ