in ,

టాప్ 5 నెట్ ఫ్లిక్స్ సీరీస్లు పార్ట్ 1……

టాప్ 5 నెట్ ఫ్లిక్స్ సీరీస్లు

ఆసక్తికరమైన అబ్బురపరిచే సీరీస్లు ఓ.టి.టిలలో ఎన్నో, అలాంటి వినోదాన్ని పంచే నెట్ ఫ్లిక్స్ లోని పలు భాషల సీరీస్లు మీ కోసం.

 

1. ఫ్రెండ్స్

అమెరికన్ సిట్కాం గా తెరకెక్కిన ఈ సీరీస్ ప్రతి ఎపిసోడ్ తోనూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడంతో పాటు వినోదాన్ని పంచుతుంది. ఈ సీరీస్ మొత్తం 10 సీజన్స్ తో 236 ఎపిసోడ్స్ తో ఉండగా ప్రతి ఎపిసోడ్ సుమారుగా 23 నిమిషాల నిడివి కలిగి ఉంటుంది.

 

2.   స్ట్రేంజర్ థింగ్స్

సైన్స్ ఫిక్షన్ హారర్ డ్రామాగా తెరకెక్కిన స్ట్రేంజర్ థింగ్స్ కొత్త కథతో నెట్ ఫ్లిక్స్ లోని ఉత్తమ సీరీస్ లలో ఒకటిగా నిలిచింది. తనదైన కొత్తదనంతో ఆసక్తికరమైన సన్నివేశాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

.

3.మని హైస్ట్

స్పానిష్ క్రైం డ్రామాగా తెరకెక్కిన సీరీస్ మని హైస్ట్. ఇది స్పానిష్ సీరీస్ అయినప్పటికీ అందరూ పోల్చుకునే భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. మొదట రిలీజ్ అయినప్పటి కంటే, లాక్ డౌన్ లో ఈ సీరీస్ కి బాగా క్రేజ్ వచ్చింది. ఈ సీరీస్ లో ప్రొఫెసర్ వేసే ప్లాన్స్ ఒక రేంజ్ లో ఊహించలేని విధంగా ఉంటాయి.

 

4.స్క్విడ్ గేమ్

ఈ స్క్విడ్ గేమ్ సీరీస్ సౌత్ కొరియన్ సర్వైవల్ గేమ్ గా  తెరకెక్కగా తనదైన కొత్తదనంతో,ఆసక్తికరమైన సన్నివేశాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల మనసులకు చేరువైంది. సూపర్ హిట్ అయిన ఈ సీరీస్ పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్.

 

5.డెత్ నోట్

హారర్ మిస్టరీ డ్రామాగా జపనీస్  కామిక్ బుక్ ఆధారంగా తెరకెక్కిన యానిమేటెడ్ సీరీస్ డెత్ నోట్. ఈ సీరీస్ ఒక కొత్త కథతో ప్రతి సన్నివేశంతో ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తూ అలరిస్తుంది. దీనిలో మొత్తం 37 ఎపిసోడ్స్ ఉండగా మొదటి నుంచి చివరి వరకు ఉత్కంఠబరితంగా సాగిపోతుంది.

What do you think?

టాప్ 5 నెట్ ఫ్లిక్స్ సినిమాలు పార్ట్ #1

వినోదాన్ని పంచే టాప్ 5 జీ-5 సినిమాలు #పార్ట్ 1….