in

ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ !

తెలుగు సినిమా క్యాతిని పెంచి,బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన “ఆర్ఆర్ఆర్” ఇప్పుడు హలీవుడ్ లో దుమ్ము దులుపుతోంది. అక్కడ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆధరించడంతో మన తెలుగు సినిమా అక్కడ అరుదైన గౌరవాలను దక్కించుకుంటుంది.
ఇటీవల ఈ సినిమాకు గాను దర్శకుడు రాజమౌళి న్యూ యార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ ఉత్తమ దర్శకుడి అవార్డును,సంగీత దర్శకుడు కీరవాణి గోల్డ్ గ్లోబ్ అవార్డును అందుకున్నారు.ఇప్పుడు ఈ సినిమాకి మరో అరుదైన గౌరవం దక్కింది.95వ ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను ఇటీవల అకాడెమీ ప్రకటించగా.. ఆర్ఆర్ఆర్ లోని “నాటు నాటు” పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అయింది.అయితే విజేతలను మార్చి 12న ప్రకటించబోతుండగా.. టాలీవుడ్ తారలు తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నారు.
“నా బృందానికి అభినందనలు,అందరికీ పెద్ద హగ్ ” అంటూ కీరవాణి స్పందించగా.. “అరుదైన ఘనత సాధించినందుకు కీరవాణి గారు, చంద్రబోస్ గారికి కంగ్రాట్స్.ఈ పాట ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది” అని ఎన్టీఅర్ ట్వీటారు.
“నాటు నాటు” పాట ఆస్కార్ కి నామినేట్ అవ్వడంపై చిరంజీవి,రామ్ చరణ్,నందమూరి బాలకృష్ణ మరియు రక్షిత్ శెట్టి కూడా సోషల్ మీడియా వేదికగా ఆర్ఆర్ఆర్ టీంని ప్రశంసిస్తూ అభినందనలను తెలిపారు.
అయితే “నాటు నాటు” పాటతో పాటు మన ఇండియా నుంచి డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరీలో ‘ఆల్ దట్ బ్రెత్స్’, డాక్యుమెంటరీ షార్ట్ఫిల్మ్ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విష్పర్స్’ నామినేట్ అయ్యాయి.
వీటిలో ఏది ఆస్కార్ కొడుతుందన్న విషయం ఈ ఏడాది మార్చ్ 12న తెలియనుంది.

What do you think?

146 Points
Upvote Downvote

ఆత్మ హత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకున్న యువ నటుడు సుదీర్ వర్మ.

పఠాన్ మూవీ రివ్యూ…