in ,

ఆత్మ హత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకున్న యువ నటుడు సుదీర్ వర్మ.

మనం కోరుకున్నది రాలేదని,అనుకున్నది అవ్వలేదని ప్రాణాలు వదలడం అంత పిచ్చితనం ఇంకొకటి ఉండదు.ఎదో బాధలోనో,కోపంలోనో ప్రాణాలు తీసుకుంటే అది మన కుటుంబానికి, సన్నిహితులకి తీరని లోటును మిగులుస్తుంది.కాని ఇవేమీ ఆలోచించకుండా కొంత మంది యువత ఆత్మ హత్యకు పాల్పడుతుంటారు.యువ నటుడు సుదీర్ వర్మ కూడా ఆ దారినే ఎంచుకున్నాడు.
కుందనపు బొమ్మ,నీకు నాకు డాష్ డాష్,సెకండ్ హ్యాండ్ సినిమాలతో ప్రేక్షుకులను మెప్పించిన 33 ఏళ్ల నటుడు సుదీర్ వర్మ ఇటీవల జనవరి 23న తన స్వస్థలంలో ఆత్మ హత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకున్నాడు.తన కుటుంబానికి తీరని లోటును మిగిల్చాడు.
తను చనిపోయాడన్న వార్తను విన్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.సుదీర్ వర్మ ఆత్మ హత్య పై కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కొంత కాలంగా సినిమా ఛాన్స్ లు దొరకక,తనను తాను నిరూపించుకునే అవకాశం రాక సుదీర్ వర్మ ఇటు ఆర్థికంగానూ,అటు మానసికంగానూ కృంగిపోయాడని,అందుకే ఈ ఘోరానికి పాల్పడ్డాడని వివరించారు.వైజాగ్ లో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు.
సుదీర్ వర్మ చనిపోయారని తెలిసిన లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ నటుడు,కుందనపు బొమ్మ సినిమాలో సుదీర్ వర్మ తో నటించిన సహా నటుడు అయిన సుధాకర్ కొమకుల ట్విట్టర్ ద్వారా తన సానుభూతిని తెలియ చేశారు.”Sudheer! Such a lovely and warm guy’ It was great knowing you and working with you brother! Can’t digest the fact that you are no more! Om Shanti!” అంటూ ట్విట్టర్ లో ఆయన ట్వీట్ చేశారు.

What do you think?

55 Points
Upvote Downvote

పిల్లలు పుట్టడం లేదని మనుషుల ఎముకలు తినిపించిన భర్త. బాధిత మహిళ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు.

ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ !