in

పఠాన్ మూవీ రివ్యూ…

పఠాన్ రివ్యూ

నటీనటులు:షారుక్ ఖాన్, దీపికా పదుకోన్, జాన్ అబ్రహం, సాల్మన్ ఖాన్(అతిథి పాత్ర), డింపుల్ కపాడియా, అశుతోష్ తదితరులు
దర్శకుడు: సిద్దార్థ్ ఆనంద్
సంగీత దర్శకుడు: విశాల్ – చంద్రశేకర్
నిర్మాత: ఆదిత్య చోప్రా (యశ్ రాజ్ ఫిల్మ్స్)
కొన్నేళ్లుగా ఫ్లాప్లతో సతమతమవుతున్న షారుఖ్ ఖాన్ గత ఏడాది బ్రహ్మాస్త్ర సినిమాలో అతిథి పాత్రలో కనిపించి మెప్పించడమే కాక తన సినిమా పఠాన్ పై అంచనాలు పెంచేశాడు.మరో పక్క “బేషరమ్ రంగ్” పాటలో దీపికా పదుకోన్ కనిపించిన విధానం వివాదాలు రేకెత్తిస్తుంది.ఇలా ఒక పక్క వివాదాల మధ్య,మరో పక్క అంచనాల మధ్య ఈ జనవరి 25న పఠాన్ విడుదలైంది.మరి పఠాన్ ప్రేక్షకులను ఎలా మెప్పించిందో,ఎంత నచ్చిందో ,అసలు కథేమిటో ఒక లుక్ ఏదామా..
కథ: పఠాన్ (షారుఖ్ ఖాన్) దేశం అంటే ప్రాణం ఇచ్చే ఒక రా ఏజెంట్.ఒక సంఘటన వల్ల అజ్ఞాతంలోకి వెల్లిపోతాడు. భారతదేశం ఆర్టికల్ 370ని రద్దు చేశాక దేశంపై దాడికి పాకిస్థాన్ కు చెందిన ఒక అధికారి వ్యూహం పన్నుతాడు.దీని కోసం ప్రైవేట్ ఏజెన్సీ ఔట్ ఫిట్ ఎక్స్ చీఫ్ జిమ్ (జాన్ అబ్రహం) ని రంగంలోకి దింపుతాడు.అయితే జిమ్ కూడా ఒకప్పుడు దేశభక్తితో భారతదేశం తరపున ఏజెంట్గా పనిచేసినవాడే.మరి అలా దేశం కోసం పోరాడిన జిమ్ శత్రువులతో ఎందుకు కలుస్తాడు? అజ్ఞాతంలో ఉన్న పఠాన్ భారత్పై వైరస్ దాడికి దిగిన జిమ్ని ఎలా ఎదుర్కొన్నాడు? వీరిద్దరి మధ్య రూబీ (దీపిక పదుకోన్)ఎలా వచ్చింది? అన్నదానిపై మిగతా కథ సాగుతుంది.
సినిమా ఎలా ఉందంటే
దాదాపు నాలుగు ఏళ్ల తరువాత షారుక్ ఖాన్ నుంచి వచ్చిన సినిమా కావడంతో ప్రేక్షకులందరూ “పఠాన్” కోసం ఆసక్తిగా ఎదురుచూసారు.ఆ అంచనాలకు తగ్గట్టే ఈ సినిమాలో షారుక్ ఖాన్ పాత్ర మెప్పించింది.తన ఫిట్ బాడీ,అద్భుతమైన విజువల్స్,ఆయన మార్క్ డైలాగులు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.దీపికా పదుకోన్,జాన్ పాత్రలు తెరపై వచ్చినప్పుడల్లా ప్రేక్షకులు ఆసక్తిగా చూసేలా దర్శకుడు వారి పాత్రలను తెరకెక్కించారు.”బేషరమ్ రంగ్” పాటతో పాటు చివరిలో వచ్చే మరో పాట కూడా ప్రేక్షకులను మెప్పించింది.సాల్మన్ ఖాన్ అతిథి పాత్ర సినిమాకు కొంత బలాన్ని చేకూర్చింది. డింపుల్ కపాడియా,ఆశ్ తోష్ తమ పాత్రల్లో వదిగిపోయి నటించి పర్లేదని పించుకున్నారు.ఇక ఫైట్స్,విజువల్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.సినిమా కథ, కథనం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది.సినిమాలోని చాలా వరకు మలుపులు ప్రేక్షకుడు ముందుగానే ఊహించగలిగేలా ఉంటాయి.జాన్,దీపికా పదుకోన్ ఫ్లాష్ బ్యాక్లు ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యాయి. మొత్తం మీద సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ లు తప్ప మిగతా ఏ సన్నివేశలు ప్రేక్షకుడిని అంతగా మెప్పించవు.
బలాలు:
షారుక్ ఖాన్,విజువల్స్, పాటలు
బలహీనతలు:
కథ, కథనం, మలుపులు
చివరిగా:
పఠాన్ పర్లేదనిపించుకుంది. ఒక సారి చూసేవచ్చు.

What do you think?

ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ !

మోదీ గొప్ప నాయకుడని, భారత్ ను సంమర్ధవంతంగా పాలిస్తున్నారని పాక్ పత్రికలు మెచ్చుకుంటున్నాయి. మోదీ ఏం చేశారంటే..