in

రివ్యూ: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం (ZEE5 లో)

రివ్యూ– చాలా కాలం పాటు సరైన సినిమాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటూ సతమతమై ఎట్టకేలకు “నాంది” సినిమాతో మంచి ఫలితం అందుకున్నారు హీరో అల్లరి నరేష్. ఒకానొక సమయంలో కామెడీ సినిమాలతో సరిపెట్టుకున్న నరేష్ ఇటీవలే సీరియస్ కథలున్న సినిమాలపై దృష్టి పెట్టారు. అటువంటి సీరియస్ కథల కోవకు చెందిన సినిమానే ఆయన నుంచి  ఇప్పుడు వచ్చిన “ఇట్లు మారెడుమిల్లి ప్రజానీకం” సినిమా.

ఇక సినిమా విషయానికి వస్తే ఎప్పటిలాగే అల్లరి నరేష్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరోయిన్ ఆనంది నటనతో అలరించినప్పటికీ ఆమె పాత్రకు భిన్నంగా కొంచెం గ్లామరెస్గా కనిపిస్తుంటుంది. కథ బాగున్నప్పటికీ,కథనంలో ఏదో తెలియని లోటు కనిపిస్తుంది. శ్రీ చరణ్ పాకాల సినిమాలోని సన్నివేశాలకు సంగీతం ఇంకొంచెం బాగా అందించుంటే బావుండేదనిపిస్తుంది.మొత్తంగా సినిమా అక్కడక్కడ ఆకట్టుకోగా,కొన్ని సన్నివేశాలు ప్రేక్షులకు కనెక్ట్ అవ్వకుండా సాగిపోతాయి.

బలాలు:

  • అల్లరి నరేష్ నటన
  • ప్రథమార్థం

బలహీనతలు:

  • ఆకట్టుకోని కథనం.
  • సాగుతునట్టుండే సన్నివేశాలు
  • ముగింపు

చివరిగా: పర్లేదనిపించుకున్న ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.

What do you think?

96 Points
Upvote Downvote

పాన్ – ఇండియా సీక్వెల్స్ తో సంచలనం…ఎటు చూసిన ఫ్రాంచైజ్ లదే హంగామా

2030 సంవత్సరంలోగా 35000 ఎలక్ట్రిక్ బస్సులు