in

కాంతారా సినిమా – రివ్యూ

రివ్యూ –

పొరుగు రాష్ట్రం నుంచి ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి తెలుగు రాష్ట్రాలలో దుమ్ము రేపిన కన్నడ సినిమా కాంతారా. కే.జీ.ఎఫ్తో భారీ విజయాన్ని అందుకున్న హోంబలే వారు ఈ సినిమాను నిర్మించగా,ప్రధాన పాత్రలో నటిస్తూ ప్రాణం పెట్టి దర్శకత్వం వహించారు రిషబ్ శెట్టి. కిషోర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో తనదైన నటన చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అచ్యుత్ కుమార్ విలక్షణమైన నటనతో ఆయన పాత్రలో వొదిగి పోయారు. అజనీష్ లోకనాథ్ అందించిన సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలించింది. సినిమాలో మొదటి నుంచి చివరి వరకు జరిగే సన్నివేసాలు ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. తెలుగు డబ్బింగ్ క్వాలిటీ,వినూత్నమైన కథనం మరియు క్లైమాక్స్ ఇవి సినిమాను ఒక స్థాయిలో నిలబెట్టాయి.

బలాలు:

  • కథనంలో కొత్తధనం.
  • రిషబ్ శెట్టి నటన
  • క్లైమాక్స్

బలహీనతలు:

  • ప్రేక్షకుడు ఊహించగల సన్నివేశాలు.
  • హీరో,హీరోయిన్ల ప్రేమ కథ.

 

చివరిగా : ఆసక్తి రేకెత్తించే సన్ని వేశాలతో ప్రేక్షకులను కట్టి పడేస్తుంది కాంతారా.

 

నటీనటులు: రిషబ్ శెట్టి, కిషోర్, సప్తమి గౌడ,మానసి సుధీర్,అచ్యుత్ కుమార్,శనిల్ గురు,ప్రమోద్ శెట్టి తదితరులు.

దర్శకత్వం: రిషబ్ శెట్టి

సంగీతం: అజనీష్ లోకనాథ్

నిర్మాత: విజయ్ కరగండూర్

What do you think?

204 Points
Upvote Downvote

2030 సంవత్సరంలోగా 35000 ఎలక్ట్రిక్ బస్సులు

ప్రమాదంలో రిషబ్ పంత్, డివైడర్ ని ఢీ కొట్టిన కారు