in

రంగ రంగ వైభవంగా – రివ్యూ

నటీనటులు: వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ(రంగ రంగ వైభవంగా), ప్రభు, నరేష్, సుబ్బరాజు,ఆలి తదితరులు.

దర్శకత్వం: గిరీశాయ

సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్

కెమెరా: శాందత్

నిర్మాత: బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్

ఉప్పెన సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన వైష్ణవ్ తేజ్ కొండ పొలెం సినిమాతో మెప్పించ లేకపోయినప్పికీ తన అదృష్టాన్ని మరో సారి పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన ఫ్యామిలీ డ్రామా ఈ రంగ రంగ వైభవంగా.

ఇక సినిమా విషయానికి వస్తే వైష్ణవ్ తేజ్,రొమాంటిక్ బామ కేతికా శర్మ తమ పాత్రల్లో తగిన విధంగా నటించి ప్రేక్షకులను అలరించారు. కానీ అసలు చిక్కు అంతా కథ,కథనాల దగ్గరే వచ్చింది. ఎప్పటికప్పుడు ప్రేక్షకులు కొత్త కథలను కోరుకుంటున్న ఈ సమయంలో పాత చింతకాయలాంటి కథను తీసుకువచ్చి వారిని మెప్పించడంలో ఘోరంగా విఫలమయ్యాడు దర్శకుడు గిరీశాయ. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు కొంచెం బలం చేకూర్చింది. కానీ మొదటి నుంచి చివరి వరకు ఈ సినిమా ప్రేక్షకుడిని అస్సలు మేప్పించ లేకపోయింది.

బలాలు

  • వైష్ణవ్ తేజ్,కేతిక శర్మల నటన,వారి మధ్య కెమిస్ట్రీ
  • దేవి శ్రీ ప్రసాద్ సంగీతం

బలహీనతలు

  • రొటీన్ కథ, ప్రేక్షకుడు ఊహించగల కథనం.
  • ద్వితీయార్థం,ముగింపు.

చివరిగా: రొటీన్గా సాగిపోయే రంగ రంగ వైభవంగా.

What do you think?

43 Points
Upvote Downvote

కాంగ్రెస్ లో గులాంనబీ రాజీనామాకు అసలు ‘కారణం’?

రణస్థలి సినిమా – రివ్యూ