in

రివ్యూ – అదొక్కటే చిరంజీవి గాడ్ ఫాదర్ కి ఉన్న అతి పెద్ద మైనస్

రివ్యూ – తమిళ్ సినిమా కత్తికి రీమేక్గా తెరకెక్కిన ఖైదీ నెం 150 సినిమాతో రీఎంట్రీ  ఇస్తూ బ్లాక్ బస్టర్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. కానీ ఆ తరువాత సైరా నరసింహ రెడ్డి,ఆచార్య అంటూ కొత్త కథలతో వచ్చినప్పటికీ అవి అనుకున్న ఫలితాల్ని అందించకపోవడంతో తనకు కలిసొచ్చిన రీమేక్ పద్ధతినే ఎంచుకున్నారు చిరంజీవి. ఆ విధంగా మలయాళంలో హిట్ అయిన లూసిఫర్‌కి రీమేక్గా చిరంజీవి రీమేక్ సినిమాలలో చేరిన సినిమా గాడ్ ఫాదర్.

దర్శకుడు ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకుల తగ్గట్టుగా,వారిని ఆకట్టుకునేలా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఇన్నాళ్లూ ఎనర్జిటిక్ రోల్స్‌లో కనిపించిన చిరంజీవి ఈ సినిమాలో మాత్రం పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా,మంచివాడిగా నటించారు. ఆయనకి పెద్దగా డైలాగులు,డ్యాన్స్లు లేకపొకపోయినప్పటికీ ఆయన తెరపై కనపడిన విధానము మరియు స్థిరపడిన నటన అతని అభిమానులకు నచ్చుతాయి. నయనతార,సత్యదేవ్ లు కీలక పాత్రలలో నటించి సినిమాకు చాలా డెప్త్ తెచ్చారు. సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించి పర్లేదనిపించుకున్నారు. మురళీశర్మ విచిత్రమైన బాడీ లాంగ్వేజ్ తో ప్రత్యేకంగా కనిపించే ప్రయత్నం చేశారు. సముద్రఖని మలయాళమాతృకలోని పాత్రకి యథాతథంగా న్యాయం చేశారు.ఇక సంగీతం విషయానికి వస్తే తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసింది. దర్శకులు మోహన్ రాజా తన టేకింగ్, ఎలివేషన్స్ తో వీలైనంతమేరకు గాడ్ ఫాదర్ను ప్రేక్షకులకు కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు.

హీరోయిన్ లేకపోయినా,చిరంజీవి స్టైల్ మాస్ సాంగ్స్ లేకపోయినా చివరివరకు ఉత్కంఠ కలిగించే యాక్షన్ పొలిటికల్ డ్రామా గాడ్ ఫాదర్. కానీ ఓటీటీ లో లూసిఫర్‌ తెలుగు డబ్బింగ్ ని అందరూ ఇదివరకే చూసేసి ఉండడం గాడ్ ఫాదర్ కి ఉన్న అతి పెద్ద మైనస్.

 

నటీనటులు:చిరంజీవి,సల్మాన్ ఖాన్,
నయన తార,సత్యదేవ్,పూరి జగన్నాథ్, సముద్రఖని, మురళి కృష్ణ తదితరులు.

దర్శకుడు: మోహన్ రాజా

సంగీత: ఎస్.ఎస్.తమన్.

నిర్మాత: రాం చరణ్,ఎన్వీ ప్రసాద్, ఆర్బీ చౌదరి

చివరిగా -గాడ్ ఫాదర్ను ఒకసారి హ్యాపీ గా చూడొచ్చు.

What do you think?

231 Points
Upvote Downvote

రాముడిగా ప్రభాస్ లుక్ – సోషల్ మీడియా షేక్ చేస్తున్న ఆదిపురుష్ కాన్సెప్ట్ ఆర్ట్

ఘోస్ట్ సినిమా – రివ్యూ