in ,

అసలైన కల్ట్ క్లాసిక్ “సప్త సాగరాలు దాటి” రివ్యూ

అసలైన కల్ట్ క్లాసిక్ “సప్త సాగరాలు దాటి” రివ్యూ

నటీనటులు: రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్, పవిత్ర లోకేశ్, అవినాష్, అచ్యుత్ కుమార్, రమేష్ ఇందిర, శరత్ లోహితాశ్వ,గోపాలకృష్ణ దేశపాండే తదితరులు

దర్శకత్వం: హేమంత్ ఎం రావు

సంగీతం: చరణ్జ్

ఎడిటింగ్: సునీల్ భరద్వాజ్

నిర్మాతలు: రక్షిత్ శెట్టి

కన్నడలో విడుదలై మంచి వసూళ్లు రాబట్టడంతో పాటు ప్రేక్షకులకు అద్భుతమైన ప్రేమ కావ్యంగా మంచి అనుభవాన్ని అందించిన సినిమా “సప్త సాగరాలు దాటి – సైడ్ ఏ”. కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా “సైడ్ ఏ, సైడ్ బి” అని రెండు భాగాల కింద తెరకెక్కింది.

అయితే మొదటి భాగం “సైడ్ ఏ” ఇటీవల విడుదల కాగా రెండో భాగం “సైడ్ బి” అతి త్వరలో విడుదల కాబోతోంది. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది.

ప్రతి చిన్నా చితకా సినిమా కల్ట్ క్లాసిక్ అని చెప్పుకుని తిరిగే ఈ కాలంలో అసలైన కల్ట్ క్లాసిక్ బొమ్మ అంటే ఏంటో ఈ “సప్త సాగరాలు దాటి” చూపించింది. మరి అలాంటి ఈ సినిమా ఎలా ఉందో తెలియాలి అంటే మిగతా రివ్యూ కూడా చదివేయండి.

కథ: మనూ (రక్షిత్ శెట్టి) సంపన్నుడైన శేఖర్ గౌడ (అవినాష్) దగ్గర డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. ప్రియా (రుక్మిణీ వసంత్) కాలేజీలో చదువుతూ సింగర్ కావాలన్న కలతో ప్రయత్నిస్తుంటింది. మనూ, ప్రియా ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటారు. అయితే ఒక రోజు రాత్రి శేఖర్ గౌడ కొడుకు అతివేగంగా కారు నడిపి ఓ వ్యక్తిని ఢీకొని ప్రాణం తీస్తాడు. శిక్ష పడకుండా కొడుకును ఎలాగైనా కాపాడాలనుకున్న శేఖర్ గౌడ మనూకి డబ్బు ఆశ చూపించి ఆ నేరాన్ని తనపై వేసుకోమని కోరతాడు. మరి ఆ తరువాత ఏమైంది? మనూ నేరాన్ని తనపై వేసుకున్నాడా? తను ప్రియా, తాము కోరుకున్న జీవితం పొందారా? తెలుసుకోవాలంటే ఈ కల్ట్ క్లాసిక్ చూడాల్సిందే.

ఎలా ఉంది అంటే: మామూలుగా మనం చూసే చాలా వరకు సినిమాలు మనల్ని ఎంటర్టైన్ చేస్తాయి. మంచి ఫైట్స్ – డాన్సులతోనో, భారీ భారీ డైలాగులతోనో మనల్ని మెప్పించడానికి ప్రయత్నిస్తాయి. కానీ ఈ సినిమా అలాంటి సినిమాలకు పూర్తి భిన్నం. ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే “it gives Experience more than entertainment”. ఇందులో ప్రతి సీను తరువాత ఏంటి? అనే దానికంటే ఆ క్షణం మనల్ని ఆ మూవ్మెంట్ లో ఉండేలా చేస్తుంది. మొదటి నుంచి స్క్రీన్ ప్లే నడిచిన విధానం, క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశం ఎడిట్ చేసిన విధానం చాలా ఆసక్తికరంగా అద్భుతంగా ఉంటాయి. ఇక రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ ల నటన విషయానికి వస్తే వారు నటించలేదు పూర్తిగా మనూ, ప్రియా పాత్రల కింద మారిపోయారు అని చెప్పాలి.

చివరిగా: ప్రతిదీ కల్ట్ క్లాసిక్ అని చెప్పుకునే కాలంలో అసలైన కల్ట్ క్లాసిక్ ఈ “సప్త సాగరాలు దాటి”

sapta sagaralu dhati now streaming on amazon prime

What do you think?

ఆసియా గేమ్స్‌లో భారత్‌ కు మరో రెండు స్వర్ణాలు

పవన్ ‘వారాహీ’ యాత్రకు పూర్తి మద్దతు ఇస్తున్నాం – బాలకృష్ణ