సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రారంభించనున్న దిల్ రాజు
నిర్మాత దిల్ రాజు తన సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించబోతున్నారట. రూ.5 కోట్ల లోపు బడ్జెట్ తో 25 చిన్న సినిమాలను నిర్మించబోతున్నారట.
ఇప్పటికే అల్లు అరవింద్ అర్హ మీడియా ద్వారా “ఆహా” (aha) ఓటీటీ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించి మంచి ఫలితాన్ని అందుకున్నారు. తక్కువ సమయంలోనే ప్రముఖ ప్లాట్ ఫామ్ లైన నెట్ ఫ్లిక్స్ (Netflix), ప్రైమ్ వీడియోలకు (prime video) దీటుగా “ఆహా” (aha) ను అభివృద్ధి పరిచారు.
ఇప్పుడు ఇదే భాటలో అడుగులు వేస్తూ టాలీవుడ్ అగ్రశ్రేణి నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. చిన్న సినిమాల కోసమే సొంతంగా దిల్ రాజు ఓ ఓటీటీ వేదికను ఏర్పాటు చేస్తున్నట్టు సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఆ ఓటీటీ కోసం రూ.5 కోట్ల లోపు బడ్జెట్ తో 25 చిన్న చిన్న సినిమాలను నిర్మించి వాటిని తన సొంత ఓటీటీ వేదికపై రిలీజ్ చేసేలా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారని, ఈ ఓటీటీకి సంబంధించి ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాని ప్రచారం జరుగుతోంది.