in ,

నటి హిమజపై కేసు నమోదు. ఆమె ఇంట్లో 15 లీటర్ల లిక్కర్ లభ్యం

నటి హిమజపై కేసు నమోదు. ఆమె ఇంట్లో 15 లీటర్ల లిక్కర్ లభ్యం

టాలీవుడ్ ప్రముఖ నటి హిమజపై కేసు నమోదు చేశారని సమాచారం. ఆమె ఇంట్లో 15 లీటర్ల లిక్కర్ దొరికిందని తెలుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం పరిధి జేబీ వెంచర్ లోని విల్లాలో మద్యం పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో పలువురు సినీనటులు పాల్గొనగా.. ఈ లిక్కర్ పార్టీపై పోలీసులు దాడి చేసి కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

కాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలో భాగంగా ఎక్సైజ్ చట్టం కింద ప్రముఖ నటి హిమజతో పాటు ఇంకొందరు నటుల పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఈ పార్టీలో సుమారు 15 లీటర్ల లిక్కర్ తో పాటు సౌండ్ సిస్టమ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే, ఈ విషయంపై నటి హిమజ స్పందించారు. “మా కొత్త ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే ఆ పార్టీని చూసి ఎవరో రేవ్ పార్టీ అని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇంటికి వచ్చి తనిఖీ చేశారు. వారికి మేము పూర్తిగా సహకరించాం. నన్ను అరెస్ట్ చేశారని వస్తున్న వార్తల్లో నిజంలేదు.” అని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు.

What do you think?

సౌతాఫ్రికా జట్టుకు భారీ షాక్. టెంబా సెమీ ఫైనల్ లో ఆడకపోవచ్చు

మేనిఫెస్టో రూపొందించనున్న టీడీపీ-జనసేన కమిటీ