in ,

‘బిచ్చగాడు’ హీరో విజయ్ పెద్ద కుమార్తె ఆత్మ హత్య

‘బిచ్చగాడు’ హీరో విజయ్ పెద్ద కుమార్తె ఆత్మ హత్య

విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన పెద్ద కుమార్తె మీరా ఆత్మహత్య చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ నిర్మాత అయిన ఫాతిమాను 2006లో వివాహం చేసుకున్నారు. వీరికి మీరా, లారా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె మీరా (16) చెన్నైలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మీరా 12వ తరగతి చదువుతోంది.

అయితే చెన్నైలోని వారి నివాసంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు మీరా ఉరేసుకుని ఆత్మ హత్యకు పాల్పడింది. ఉదయాన్నే ఇంట్లో వాళ్లు చూసేసరికి ఆమె ఉరేసుకుని కనిపించగా.. వెంటనే హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. తీవ్రమైన ఒత్తిడితోనే మీరా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనతో విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

What do you think?

ప్రసవం జరిగిన నెలలోనే ప్రజల పని.. మేయర్ ఆర్య

రూ.62 కోట్లకు అమ్ముడుపోయిన భారతీయ పెయింటింగ్