in

రూ.62 కోట్లకు అమ్ముడుపోయిన భారతీయ పెయింటింగ్

రూ.62 కోట్లకు అమ్ముడుపోయిన భారతీయ పెయింటింగ్

మన భారతీయ సంతతికి చెందిన పెయింటర్ వేసిన ఓ పెయింటింగ్ చరిత్ర సృష్టించింది. ఏకంగా రూ.62 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది.

భారతీయ సంతతికి చెందిన అమృతా షేర్గిల్ కి చిన్న తనం నుంచి కళల పై ఉన్న ఇష్టాన్ని చూసిన ఆమె తల్లిదండ్రులు అమృతా షేర్గిల్ కి 16 ఏళ్లు ఉన్నప్పుడే పారిస్ కు తీసుకెళ్లి అక్కడ పెయింటింగ్ లో శిక్షణ ఇప్పించారు. ఆ సమయంలో పారిస్ లో కనిపించిన మోనాలిసా పెయింటింగ్ ఆమెను చాలా ప్రభావితం చేసింది.

1937లో ఆమె ‘ది స్టోరీ టెల్లర్’ అనే ఓ ఆయిల్ పేయింటింగ్ వేసింది. కాగా ఈ ఆయిల్ పేయింటింగ్ ను న్యూదిల్లీలోని ‘ది ఒబెరాయ్ హోటల్’లో ఇటీవల వేలం వేశారు. ఆ వేలంలో ఈ పైంటింగ్ రూ.62 కోట్లకు అమ్ముడుపోయి చరిత్ర సృష్టించింది. ఇంత భారీ మొత్తానికి అమ్ముడుపోయిన తొలి భారతీయ పెయింటింగ్ గా రికార్డు నెలకొల్పింది.

అయితే గతంలో సయ్యద్ హైదర్ రజా గీసిన ‘జెస్టేషన్’ పెయింటింగ్ రూ. 51.75 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించగా.. ఇప్పుడు ఈ రికార్డును అమృత షేర్గిల్ ‘ది స్టోరీ టెల్లర్’ పెయింటింగ్ బద్దలు కొట్టి చరిత్రకెక్కింది.

What do you think?

‘బిచ్చగాడు’ హీరో విజయ్ పెద్ద కుమార్తె ఆత్మ హత్య

దగ్గినందుకు జైలు శిక్ష విధించిన సింగపూర్ కోర్టు