in

రష్మికా డీప్ ఫేక్ వీడియోపై స్పందించిన కేంద్రం

రష్మికా డీప్ ఫేక్ వీడియోపై స్పందించిన కేంద్రం

ప్రముఖ హీరోయిన్ రష్మికా మండన్న డీప్ ఫేక్ వీడియో (deepfake video) ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిందన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే చాలా మంది సినీ తారలు స్పందించారు. అమితాబ్ బచ్చన్ నుంచి హీరో అక్కినేని నాగ చైతన్య వరకు అందరూ దీనిపై తమ తమ సోషల్ మీడియా అకౌంట్లలో స్పందిస్తూ ఇది చాలా ప్రమాదకరమని.. ఫ్యూచర్ టెక్నాలజీ గురించి ఆలోచిస్తుంటే భయం వేస్తుందని.. పోస్టులు పెట్టారు. వారికి రష్మికా కూడా తనకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపింది.

అయితే తాజాగా ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఇలాంటి వీడియోల ఆట కట్టించేందకు నడుంబిగించింది. డీప్ ఫేక్ వంటి వీడియోలు క్రియేషన్, సర్క్యులేషను సంబంధించిన పెనాల్టీలు, నిబంధనలు గుర్తు చేస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆయా సోషల్ మీడియా సంస్థలకు అడ్వయిజరీని పంపించింది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 లోని సెక్షన్ 66డిని అందులో ఉటంకించింది. కంప్యూటర్ వనరులను ఉపయోగించి వ్యక్తులను మోసగిస్తే పడే శిక్ష, పెనాల్టీల గురించి ఈ సెక్షన్ చెబుతోంది. ఎవరైనా, ఏదైనా కమ్యూనికేషన్ పరికరం లేదా కంప్యూటర్ రిసోర్స్ వినియోగించి వ్యక్తులను మోసం చేస్తే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా కూడా పడుతుందని సోషల్ మీడియా ప్లాట్ఫాంలకు కేంద్రం గుర్తుచేసింది.

What do you think?

బాలీవుడ్ లో రీమేక్ కాబోతున్న “బేబి”

జగన్‌ అక్రమాస్తుల కేసులపై సీబీఐ కోర్టు విచారణ