in

తీరానికి కొట్టుకొచ్చిన 15 మీటర్ల భారీ తిమింగలం

తీరానికి కొట్టుకొచ్చిన 15 మీటర్ల భారీ తిమింగలం

భారీ తిమింగలం మృతదేహం సముద్రతీరానికి కొట్టుకువచ్చింది. ఇది 15 మీటర్లు పొడవు, పది టన్నుల బరువు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే ఓ భారీ తిమింగలం మృతదేహం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలోని భావనపాడు సముద్రతీరానికి కొట్టుకువచ్చింది. శుక్రవారం ఉదయం సముద్ర వేటకు వెళ్తున్న కొందరు మత్స్యకారులు ఈ మృతదేహాన్ని గమనించారు. ఆ భారీ తిమింగలం చనిపోయి ఉండటం చూసి ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియచేశారు.
కాగా ఈ తిమింగలం దాదాపు 15 మీటర్లు పొడవు, పది టన్నుల బరువు ఉంటుందని మత్స్యకారులు అంచనా వేస్తున్నారు.

What do you think?

ఇతను లక్కీ డ్రాలో రూ. 45 కోట్లు గెలుచుకున్నాడు

ఇండియా గెలిస్తే రూ.100 కోట్లు పంపిణీ చేస్తాం – పునీత్ గుప్తా